twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi: హిట్ అయితే క్రెడిట్ మీది.. ప్లాప్ అయితే డైరెక్టర్ తప్పా? వాళ్లతో పోలుస్తూ చిరుపై ట్రోలింగ్!

    |

    మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద కొడుకులా పాటుపడుతుంటారు. సుమారు 4 దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకో ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా అక్టోబర్ 5న అంటే ఇవాళ గ్రాండ్ గా చిరంజీవి 'గాడ్ ఫాదర్' (Godfather) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తనకంటే యంగ్ హీరోలైన మహేశ్ బాబు, ఎన్టీఆర్ లతో పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

     సినిమాలతో గట్టిపోటీ ఇస్తూ..

    సినిమాలతో గట్టిపోటీ ఇస్తూ..

    దాదాపు నాలుగు దశాబ్ధాలుగు తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆచార్య పరాజయం పాలవ్వడం చిరుకు మింగుడు పడటం లేదని పలువురు భావిస్తున్నారు.

    కొరటాల శివ అని పరోక్షంగా..

    కొరటాల శివ అని పరోక్షంగా..

    ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం డైరెక్టర్ కొరటాల శివ అని పరోక్షంగా ఇప్పటికే రెండు మూడు సార్లు నిందించారు చిరంజీవి. ఇటీవల ఓ సందర్భంలో కూడా డైరెక్టర్ ఏం చెబితే అదే చేశామని మాట్లాడారు చిరు. ''కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడేవాడిని.. ప్లాప్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అవి అప్పటి రోజులు. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను. ఆచార్య విషయానికొస్తే ఆ సినిమా ఫ్లాప్ నన్ను బాధించలేదు.

    డైరెక్టర్ చెప్పిందే చేశాం..

    డైరెక్టర్ చెప్పిందే చేశాం..

    ఎందుకంటే డైరెక్టర్ చెప్పిందే చేశాం. బాధపడ్డ విషయమేమంటే.. నేను, రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించాం. అలాంటి ఆ మూవీ ప్లాప్ కావడం బాధించింది. తర్వాత మేం మళ్లీ కలిసి సినిమా చేస్తే ఆ జోష్ ఉండకపోవచ్చు'' అని చిరంజీవి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. చిరంజీవి స్పందించిన తీరును వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను కాదని కొరటాల శివ సినిమా డైరెక్ట్ చేస్తారా, ప్లాప్ వస్తే దానికి పూర్తి బాధ్యుడ్ని డైరెక్టర్ నే చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

    తనదే ప్రధాన బాధ్యత అని..

    తనదే ప్రధాన బాధ్యత అని..

    అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో పోలుస్తూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. సినిమా ప్లాప్ అయితే తనదే ప్రధాన బాధ్యత అని, హిట్ అయితే ఆ క్రెడిట్ డైరెక్టర్ తో పాటు అందరికీ దక్కుతుందని మహేశ్ బాబు చెప్పాడని అంటున్నారు.

    అది ఆయన గొప్పతనం..

    దూకుడు, బిజినెస్ మేన్ మూవీల సక్సెస్ కారణం శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ లు ని మహేశ్ బాబు చెప్పాడని, అది ఆయన గొప్పతనం అని దాసరి నారాయణ కూడా చెప్పుకొచ్చారని వీడియోలు ట్రెండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ కూడా సినిమాలు ప్లాప్ అయితే దర్శకులపై నెట్టలేదని కామెంట్స్ చేస్తున్నారు.

    అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తే..

    యంగ్ హీరోలు అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తే చిరంజీవి లాంటి స్టార్ అలా మాట్లాడటమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హిట్ అయితే క్రెడిట్ మీకు.. ప్లాల్ అయితే డైరెక్టర్ తప్పా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న అంటే ఇవాళ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మోహన్ లాల్ నటించి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు.

    English summary
    Netizens Brutally Trolled Megastar Chiranjeevi Over Blaming Koratala Siva For Aacharya Flop And Comparing To Mahesh Babu And Junior NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X