Naga Chaitanya మళ్లీ తెరపైకి నాగచైతన్య-సమంత విడాకుల అంశం - మాజీ భార్య కోసం చైతూ ఏం చేశాడంటే?

నాగాచైతన్య - సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు విడిపోయి చాలా కాలమే అయింది. కానీ అభిమానులు మాత్రం దీనిని ఇంకా మర్చిపోలేదు. ఈ ఇద్దరు కలిస్తే చూడాలని ఇంకా ఆశిస్తున్నారు. అయితే తాజాగా మరోసారి చైతూ - సామ్​ విడాకుల అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. దాని గురించి పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.,.

ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్ కపుల్​ నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలమే అవుతోంది. అయినా వారిద్దరి గురించి ఇప్పటికీ ఏదో విషయం హాట్ టాపిక్​గా మారుతుంటూనే ఉంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల అంశం తెరపైకి వస్తూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ సరైన క్లారిటీ ఇవ్వలేదు.

Netizens Comments on Naga Chaitanya Follows Ex Wife Samantha News Goes Viral

సరే ఏదిఏమైనా ఈ ఇద్దరు మాత్రం తమ లైఫ్​ను ఒంటరిగానే జీవిస్తూ ప్రొఫెషనల్​ లైఫ్​లో ముందుకెళ్తున్నారు. కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా మాత్రం సామ్​ తన వైవాహిక జీవితాన్ని పైకి లెపుతూ చైతూపై పరోక్షంగా తన జీవితం నాశమైపోయినట్లు కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. విడాకులు వల్ల తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని, ఇప్పటికీ దాని నుంచి బయటపడలేకపోతున్నానంటూ తన బాధను ఏదో ఒక రూపంలో బయటపెడుతూనే ఉంటుంది.

కానీ నాగ చైతన్య అలా కాదు. తనకు సామ్ గురించి ఏదైన ప్రశ్న ఎదురైతే పాజిటివ్​గానే రెస్పాన్స్ అవుతాడు. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు చెబుతాడు. ఈ కామెంట్స్​పై సోషల్​ మీడియాలో పెద్ద రచ్చే సాగుతుంది. ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. మ్యూచువల్ ఫ్యాన్స్​ ఏమో ఒకరికి మాత్రమే సపోర్ట్​ చేయలేక బాధపడుతుంటారు.

Netizens Comments on Naga Chaitanya Follows Ex Wife Samantha News Goes Viral

అయితే తాజాగా మరోసారి నాగచైతన్య - సామ్ విడాకుల అంశం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మళ్లీ గొడవపడటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ జంట ఒకరినొకరు ఫాలో అన్​ఫాలో చేసుకోవడంపై తెగ చర్చిస్తున్నారు. అసలు డివొర్స్​ తీసుకున్నప్పుడు సామ్​ ఎందుకు ఇన్​స్టాలో చైతూను అన్​ఫాలో చేయాలని ప్రశ్నించడం మళ్లీ మొదలుపెట్టారు? సామ్ ఎంత అక్కసు బయటకు కక్కినా చైతూ మాత్రం కూల్​గా, పాజిటివ్​గా సమాధానం చెబుతూ వస్తున్నాడని, ఇంకా సామ్​ను ఫాలో చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. మా చై బంగారం, చైతూది నిజమైన ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంత అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి కొంతమంది సామ్ చైతూ కలవాలని, ఎవరినీ తప్పుబట్టవద్దని అభిప్రాయపడుతున్నారు.

కాగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండల్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత మయోసైటిస్‌ చికిత్ప తీసుకుంటూ హెల్త్ రికవరీ చేసుకుంటోంది. ఈ మధ్య మళ్లీ బ్యాక్​ టు వర్క్​లోకి అడుగుపెట్టింది. త్వరలోనే ఇండియన్ వెర్షన్​ సిటాడెల్ వెబ్​ సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X