Geetanjali 2 : పిచ్చి పీక్స్.. స్మశాన వాటికలో టీజర్ లాంచ్... ఇదేందయ్యా ఇది!

ఓ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు మేకర్స్ కూడా చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా దాని మీద హైప్ నెలకోల్పాలంటే.. సరైనా ప్రమోషన్స్ ఉండాలి. ఆ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలి. ఇక ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వింతగా ఉంటున్నాయి. ఇక తాజాగా ఓ హార్రర్ సినిమా టీజర్ లాంచ్ ను స్మశాన వాటికలో నిర్వహించబోతున్నారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఓవర్‌ నైట్‌ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ అంజలీ. ఈ బ్యూటీ పేరుకు తెలుగమ్మాయే. కానీ కోలీవుడ్‌ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసి అక్కడ పాపులారిటీ కొట్టేసింది. ఎప్పుడో ఒకసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ సినిమాలు చేస్తూ ఇక్కడి వారిని అలరిస్తుంది. ఇక కేవలం హీరోయిన్‌ పాత్రలే చేయాలని గిరి గీసుకోకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దక్షిణాదిన మంచి పాపులారిటీతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

Netizens Criticized on Geethanjali Malli Vachindhi Movie Teaser launch in Begumpet graveyard See The Details

ఇక తెలుగులో అంజలికి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో గీతాంజలి అని చెప్పవచ్చు. ఈ సినిమా హార్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. తొమ్మిదేళ్ల కిందట రిలీజైన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. హార్రర్‌ బ్యాక్‌ డ్రాప్‌ జోనర్లో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. గీతాంజలి మళ్లీ వ్చచింది అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఓ పాడుబడిపోయిన బంగ్లాలో తెల్లని దుస్తులు దరించి అటు వైపు తిరిగి ఉన్న అంజలి పోస్టర్‌ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అంజలి కెరియర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఓ వైపు హీరోయిన్‌గా.. మరో వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ.. ఇప్పటికి 50వ చిత్రానికి చేరుకుంది. అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న నెటిజన్స్ నోరేళ్ల బెడుతున్నారు.

ఇక ఈ సినిమా నుంచి టీజర్ లాంఛ్ అప్డేట్ వచ్చింది. అయితే ఆ టీజర్ ఎక్కడో కాదు.. స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి ఈ సినిమా టీజర్ లాంచ్ ను బేగంపేట శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్.. అంటూ రాసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ పలు విమర్శలు చేస్తున్నారు.

పిచ్చి పీక్స్ పోయిందని.. టీజర్ లాంచ్ స్మశాన వాటికలో ఏంటని కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం.. ఇంతలా చేయాలా అంటూ కొంత మంది అనగా.. మరికొంత మంది దీనికి పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. కొత్తగా చే్స్తున్నారు.. ఇది కూడా ఓ సెన్సేషనే అంటున్నారు. ఏది ఏమైనా గీతాంజలి సినిమా మరోసారి సంచలనం సృష్టించేలా కనిపిస్తుంది. చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X