Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Nagababu: శివుడిపై నాగబాబు రాజకీయ వ్యాఖ్యలు.. పిచ్చి కూతలు కూయకంటూ ఘోరంగా!
సినీ నిర్మాత, నటుడు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ జబర్ధస్త్ షోలో కూడా చాలా కాలంపాటు జడ్జ్ గా వ్యవహరించారు. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నాగబాబు.. సామాజిక అంశాలు, తదితర విషయాలపై కామెంట్లు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కామెంట్స్ చేసే క్రమంలో పలు విమర్శల పాలవుతారు నాగాబాబు. తాజాగా శివుడిపై ఆయన చేసన కామెంట్స్ తో తెగ వైరల్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతూ ట్రోల్ చేస్తున్నారు.

ఎక్కువగా రాజకీయంపై వ్యాఖ్యలు..
సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ట్రోలింగ్ కు గురయ్యారు. ట్విటర్ లో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన సామాజిక అంశాలతో పాటు రాజకీయ పరమైన కామెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు. నాగబాబు జనసేన పార్టీ నాయకుడు కూడా. కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటాయి.

శివుడిని లాగారని..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ట్విటర్ వేదికగా కామెంట్స్ చేసే నాగబాబు అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ కార్యకర్తలపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు. తాజాగా అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పరోక్షంగా కామెంట్స్ చేశారని ట్విటర్ లో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా నాగబాబు చేసిన రాజకీయ పరమైన వ్యాఖ్యల్లో శివుడిని లాగారాని మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శివుడికి మాత్రం భయం పోలేదు..
నాగబాబు ట్వీట్ లో "భస్మాసురుడు శివుడు వరంతో ఎవరి తలమీద అయినా చేయి పెడితే భస్మం అవ్వాలని కోరుకున్నాడు. కానీ, తనకు వరం ఇచ్చిన శివుడి మీద ప్రయోగించాలని చూశాడు. కానీ, విష్ణు మూర్తి ఉపాయంతో శివుడు బతికాడు, భస్మాసురుడు చచ్చాడు. కానీ, శివుడికి మాత్రం భయం పోలేదు. భస్మాసురుడు మళ్లీ పుడితే ఎక్కడ నెత్తిమీద చెయ్యి పెట్టి చంపుతాడో అని భయపడి కోట్లాది మనుషుల రూపంలో జన్మించాడు" అని రాసుకొచ్చారు.
|
భస్మం చేసే కార్యక్రమంలో..
నాగబాబు ఇంకా ట్వీట్ కొనసాగిస్తూ "ఒకడు భస్మం అయినా ఇంకో మనిషి రూపంలో బతికి ఉండొచ్చు అని తెలివిగా ఆలోచించాడు. అందుకే ప్రజలే దేవుళ్లు అని నానుడి వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భస్మాసురుడు మళ్లీ పుట్టాడు, జనాలను భస్మం చేయడానికి. అందుకే కనబడిన ఆడవారి మీద, మగవారి మీద చేతులుంచి దేవుడి రూపాలైన జనాన్ని భస్మం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఓ విష్ణు దేవా ఈ జనాల్లో మళ్లీ పుట్టిన శివుడిని కాపాడు" అని పేర్కొన్నారు.
|
జగన్ ను అలా పోల్చారని..
అయితే తన దగ్గరికి వచ్చిన ప్రజలను సీఎం జగన్ చేతులు పెట్టి ఆశీర్వదించడం తెలిసిందే. వాటిని ఉద్దేశించే నాగబాబు నాగబాబు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందులో జగన్ ను భస్మాసురిడిగా పరోక్షంగా పోల్చారని, అలాగే శివుడు భయపడ్డాడని నాగబాబు పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిడి మిడి జ్ఞానంతో ఇలాంటి ట్వీట్లు చేయొద్దని, శివతత్వం గురించి ముందు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
|
పిచ్చి కూతలు కూయకు..
"ప్రతీ మూర్ఖుడు తనకు అన్నీ తెలుసని అనుకుంటాడు. నీకు శివతత్వం గురించి తెలియకపోతే మూసుకోని కూర్చో. యమధర్మ రాజుకే మరణం ప్రసాదించినవాడు, కాలానికి అతీతుడు మహాకాళుడు. శివుడు భోళాతత్వం గురించి తెలియడానికి ఆ కథ. అంతేకానీ భయపడి పారిపోయాడు వంటి పిచ్చి కూతలు కూయకు" అని ఓ నెటిజన్ నాగబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. ఇలా అనేకమంది నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.