Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Boycott Brahmastra రాజమౌళికి స్వీట్ వార్నింగ్.. బ్రహ్మాస్త్రను ప్రమోట్ చేయొద్దు.. నెటిజన్ల ట్రోల్
సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లుగా బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కారణంగా చాలా హిందీ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడింది. కరీనా కపూర్‌తో కలిసి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన.. లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్, తాప్సీ పన్ను నటించిన దొబారా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి కొన్ని చిత్రాలు త్వరలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఎలాగైనా హిట్ చేయాలని...
ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాను సూపర్ హిట్ చేసేందుకు చిత్రబృందం శాయశక్తులా కృషిచేస్తోంది. గర్భిణిగా ఉన్నా.. ఆలియా కూడా ప్రమోషన్లలో పాల్గొంటోంది. చిత్రాన్ని కూడా తన బిడ్డలానే భావిస్తోంది.
|
ముందుండి జక్కన్న ప్రచారం..
ఇక.. బ్రహ్మాస్త్రను దర్శకధీరుడు రాజమౌళి కూడా యాక్టివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఆయనే కారణం. సామాజిక మాధ్యమాల్లోనూ చిత్రానికి సంబంధించిన పోస్టులు చేస్తుంటారు జక్కన్న. తన అభిమానులు, ప్రేక్షకులను సినిమా చూడాల్సిందిగా కోరుతుంటారు.
మీరంటే ఇష్టం.. ప్లీజ్ సపోర్ట్ చేయొద్దు..
అయితే బ్రహ్మాస్త్ర బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్న ఓ వర్గం ప్రజలు.. రాజమౌళికి ఓ విన్నపం చేయడం ఆసక్తికరంగా మారింది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ప్రమోట్ చేయొద్దని జక్కన్నని కోరుతున్నారు నెటిజన్లు. రాజమౌళి అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయన బాలీవుడ్‌తో చేతులు కలిపి తన గౌరవాన్ని కోల్పోవద్దని ట్వీట్ చేస్తున్నారు. అ ట్వీట్లు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కరణ్ జోహార్ మెప్పు కోసమే...
రాజమౌళి బాలీవుడ్‌ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఆయననంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆయన ఈ చెత్త వుడ్‌కు దూరంగా ఉండాలి అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. కరణ్ జోహార్ మెప్పు కోసమే రాజమౌళి ఇలా చేస్తున్నారని మరో యూజర్ పేర్కొన్నాడు. మీరు బ్రహ్మాస్త్రను సపోర్ట్ చేసినట్లు.. ఆర్ఆర్ఆర్కి కూడా ప్రతి నటుడు, దర్శకుడు మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని ఇంకొకరు ట్వీట్ చేశారు.
గౌరవం కోల్పోవద్దు.. తగిన ప్రతిఫలం అనుభవిస్తారు..
బ్రహ్మాస్త్రను సపోర్ట్ చేయకండి సర్.. బాలీవుడ్ వాళ్లు మీ క్రేజ్ వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలను, నటులను కరణ్ జోహార్ ఎప్పుడూ హాస్యాస్పదం చేస్తూ మాట్లాడుతాడు. దక్షిణాది చిత్రాలకు హిందీలో స్క్రీన్స్ దక్కనివ్వడు.. అని ఓ యూజర్ ఆరోపించాడు. మీరు బాలీవుడ్‌కు మద్దతివ్వడం వల్ల గౌరవం కోల్పోతున్నారంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. దీనికి తగిన ప్రతిఫలం రాజమౌళి అనుభవిస్తాడని మరొకరు ట్వీట్ చేశారు.
ముంబయి మాఫియాకు మద్దతు వద్దు..
ఆర్ఆర్ఆర్కు
హిందీలో
ఎవరూ
సపోర్ట్
చేయలేదు.
ముంబయి
మాఫియా
వల్లే
రూ.1500
కోట్ల
కన్నా
ఎక్కువ
వసూళ్లు
రాబట్టాల్సిన
చిత్రం..
ఓపెనింగ్స్‌లో
వెనుకపడిందని
ఓ
యూజర్
ట్వీట్
చేశాడు.
రాజమౌళి..
గొప్ప
దర్శకుడని,
ప్రపంచ
వేదికపై
భారతీయుడు
గర్వించదగిన
సినిమాలు
తీశారని
ఓ
యూజర్
ట్వీట్
చేశాడు.
అయితే
తనను
వాడుకోవాలని
చూస్తున్న
బాలీవుడ్‌కు
మాత్రం
సపోర్ట్
చేయొద్దని
అతను
పేర్కొన్నాడు.
బ్రహ్మాస్త్ర
చిత్రాన్ని
కరణ్
జోహార్‌కు
చెందిన
ధర్మ
ప్రొడక్షన్స్,
స్టార్
స్టూడియోస్
సంయుక్తంగా
నిర్మించాయి.
ఇందులో
బిగ్‌బీ
అమితాబ్
బచ్చన్,
కింగ్
నాగార్జున,
మౌనీ
రాయ్
కీలక
పాత్రలు
పోషించారు.
సెప్టెంబర్
9న
హిందీ,
తమిళం,
తెలుగు,
కన్నడ,
మలయాళ
భాషల్లో
ఈ
చిత్రం
విడుదలకానుంది.
దక్షిణాది
భాషల్లో
ఈ
చిత్రాన్ని
రాజమౌళి
ప్రెజెంట్
చేస్తున్నారు.