twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Boycott Brahmastra రాజమౌళికి స్వీట్ వార్నింగ్.. బ్రహ్మాస్త్రను ప్రమోట్ చేయొద్దు.. నెటిజన్ల ట్రోల్

    |

    సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లుగా బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కారణంగా చాలా హిందీ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడింది. కరీనా కపూర్‌​తో కలిసి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన.. లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్, తాప్సీ పన్ను నటించిన దొబారా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి కొన్ని చిత్రాలు త్వరలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

    ఎలాగైనా హిట్ చేయాలని...

    ఎలాగైనా హిట్ చేయాలని...

    ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్​‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాను సూపర్​ హిట్ చేసేందుకు చిత్రబృందం శాయశక్తులా కృషిచేస్తోంది. గర్భిణిగా ఉన్నా.. ఆలియా కూడా ప్రమోషన్లలో పాల్గొంటోంది. చిత్రాన్ని కూడా తన బిడ్డలానే భావిస్తోంది.

    ముందుండి జక్కన్న ప్రచారం..

    ఇక.. బ్రహ్మాస్త్రను దర్శకధీరుడు రాజమౌళి కూడా యాక్టివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్​‌లో జరిగిన ప్రెస్‌మీట్‌​కు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఆయనే కారణం. సామాజిక మాధ్యమాల్లోనూ చిత్రానికి సంబంధించిన పోస్టులు చేస్తుంటారు జక్కన్న. తన అభిమానులు, ప్రేక్షకులను సినిమా చూడాల్సిందిగా కోరుతుంటారు.

    మీరంటే ఇష్టం.. ప్లీజ్ సపోర్ట్ చేయొద్దు..

    మీరంటే ఇష్టం.. ప్లీజ్ సపోర్ట్ చేయొద్దు..

    అయితే బ్రహ్మాస్త్ర బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్న ఓ వర్గం ప్రజలు.. రాజమౌళికి ఓ విన్నపం చేయడం ఆసక్తికరంగా మారింది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ప్రమోట్ చేయొద్దని జక్కన్నని కోరుతున్నారు నెటిజన్లు. రాజమౌళి అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయన బాలీవుడ్‌తో చేతులు కలిపి తన గౌరవాన్ని కోల్పోవద్దని ట్వీట్ చేస్తున్నారు. అ ట్వీట్లు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    కరణ్ జోహార్ మెప్పు కోసమే...

    కరణ్ జోహార్ మెప్పు కోసమే...

    రాజమౌళి బాలీవుడ్‌​ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఆయననంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆయన ఈ చెత్త వుడ్‌కు దూరంగా ఉండాలి అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. కరణ్ జోహార్ మెప్పు కోసమే రాజమౌళి ఇలా చేస్తున్నారని మరో యూజర్ పేర్కొన్నాడు. మీరు బ్రహ్మాస్త్రను సపోర్ట్ చేసినట్లు.. ఆర్​ఆర్​ఆర్‌​కి కూడా ప్రతి నటుడు, దర్శకుడు మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని ఇంకొకరు ట్వీట్ చేశారు.

    గౌరవం కోల్పోవద్దు.. తగిన ప్రతిఫలం అనుభవిస్తారు..

    గౌరవం కోల్పోవద్దు.. తగిన ప్రతిఫలం అనుభవిస్తారు..

    బ్రహ్మాస్త్రను సపోర్ట్ చేయకండి సర్.. బాలీవుడ్ వాళ్లు మీ క్రేజ్​ వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలను, నటులను కరణ్ జోహార్ ఎప్పుడూ హాస్యాస్పదం చేస్తూ మాట్లాడుతాడు. దక్షిణాది చిత్రాలకు హిందీలో స్క్రీన్స్​ దక్కనివ్వడు.. అని ఓ యూజర్ ఆరోపించాడు. మీరు బాలీవుడ్‌కు మద్దతివ్వడం వల్ల గౌరవం కోల్పోతున్నారంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. దీనికి తగిన ప్రతిఫలం రాజమౌళి అనుభవిస్తాడని మరొకరు ట్వీట్ చేశారు.

    ముంబయి మాఫియాకు మద్దతు వద్దు..

    ముంబయి మాఫియాకు మద్దతు వద్దు..


    ఆర్​ఆర్​ఆర్​‌కు హిందీలో ఎవరూ సపోర్ట్ చేయలేదు. ముంబయి మాఫియా వల్లే రూ.1500 కోట్ల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సిన చిత్రం.. ఓపెనింగ్స్‌​లో వెనుకపడిందని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. రాజమౌళి.. గొప్ప దర్శకుడని, ప్రపంచ వేదికపై భారతీయుడు గర్వించదగిన సినిమాలు తీశారని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. అయితే తనను వాడుకోవాలని చూస్తున్న బాలీవుడ్‌కు మాత్రం సపోర్ట​్ చేయొద్దని అతను పేర్కొన్నాడు.
    బ్రహ్మాస్త్ర చిత్రాన్ని కరణ్ జోహార్​‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్​ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు.

    English summary
    Netizens have requested RRR director SS Rajamouli to not promote Alia Bhatt and Ranbir Kapoor's film Brahmastra will be released on September 9. a section of people who are boycotting the film has requested the RRR director to not promote Brahmastra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X