నీ పిల్లలకు కూడా అదే గతి.. కరణ్ జోహర్‌కు నెటిజన్ల మరో ఝలక్
బాలీవుడ్‌లో పెళ్లి కాకుండానే తండ్రి అయిన దర్శకుడు కరణ్ జోహర్ పిల్లల పెంపకంపై పుస్తకం రాస్తున్నట్టు ప్రకటించడంతో బాలీవుడ్‌లో కొందరు సన్నిహితులు స్వాగతించారు. సరోగసి ద్వారా పుట్టిన కవల పిల్లలు రూహి, యష్ గురించి చెప్పడానికి ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకాన్ని రాస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ట్విట్టర్ ద్వారా వెలువడగానే నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా ట్రోలింగ్ చేసున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ ఎలా ఉందంటే..
Recommended Video

లవ, కుశల్లాంటి నా కవల పిల్లల గురించి
తన ముద్దు బిడ్డలు లవ, కుశులపై తనకు ఉన్న ప్రేమానురాగాలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లను, తన అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకురావాలనుకొంటున్నట్టు వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణ కర్త జాగర్‌నాట్ బుక్స్ అందుబాటులోకి తెస్తున్నది. ఈ విషయాన్ని కరణ్ జోహర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

పిల్లలపై నేను రాసిన పుస్తకం
మీతో నేను ఓ ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవాలని అనుకొంటున్నాను. పిల్లలపై నేను రాసిన పుస్తకానికి సంబంధించిన పుస్తకం ఇది. ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ త్వరలోనే మీ ముందుకు వస్తున్నది. ఈ పుస్తకం రాయడానికి సహకరించిన ట్వింకిల్ ఖన్నాకు ధన్యవాదాలు అంటూ కరణ్ ట్వీట్ చేశారు.

కరణ్ జోహర్ పుస్తకాన్ని బహిష్కరిద్దాం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులకు సెగ తగిలిన నేపథ్యంలో కరణ్ జోహర్‌ను కూడా నెటిజన్లు వెంటాడుతున్నారు. ఈ క్రమంలో కరణ్ ట్వీట్‌పై స్పందిస్తూ.. ఈ పుస్తకాన్ని బహిష్కరించండి అంటూ నెటిజన్ల పిలుపు నిచ్చారు. పిల్లల పేరు చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నావా? సుశాంత్‌ను నీవు బాయ్‌కాట్ చేస్తే.. మేము మీ పిల్లల్ని బహిష్కరిస్తున్నాం అంటూ నెటిజన్లు తమ తడాఖా చూపిస్తున్నారు.

నీ పిల్లలకు అలాంటి పరిస్థితి ఎదురైతే..
జాతీయ టెలివిజన్ ఛానెల్స్‌పై నీవు సుశాంత్‌ను ఎలా అవమాన పరిచావో.. ఎలా కించపరిచావో అందరికీ తెలుసు. అలాగే నీ పిల్లలకు కూడా అలా అసహ్యించుకొంటే, వారిని వేధిస్తే, లేదా సమాజం నుంచి బహిష్కరిస్తే నీకు ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ కరణ్ జోహర్‌పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.


Click it and Unblock the Notifications











