తాను ఏడ్చి.. అందరినీ ఏడిపించిన విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ట్రోలింగ్

ఇటీవల జరిగిన దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో తన సాధారణ స్టైల్ లోనే ఆడియన్స్‌లో జోష్ నింపుతూ తెలంగాణ యాసలో అదరగొట్టారు విజయ్ దేవరకొండ. కాకపోతే మధ్యలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఎమోషన్‌కి లోనయ్యారు. కంటతడి పెట్టుకుంటూ తమ్ముడి గురించి చెప్పి అక్కడున్న వారందరి కళ్ళలో నీళ్లు తెప్పించాడు.

 దొరసాని వేదికపై

దొరసాని వేదికపై

దొరసాని వేదికపై తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి గొప్పగా చెప్పిన విజయ్ దేవరకొండ.. తన తమ్ముడితో ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని అన్నాడు. ఆనంద్ దేవరకొండ విదేశాలకు వెళ్లి తమకు డబ్బు పంపించేవాడని, అతనిచ్చిన ఆర్ధిక బలంతోనే తోనే తాను హీరోగా ఎదిగాననని విజయ్ దేవరకొండ చెబుతూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.

ఒక్క కారణమే అని పేర్కొంటూ కుమిలిపోయిన విజయ్ దేవరకొండ

ఒక్క కారణమే అని పేర్కొంటూ కుమిలిపోయిన విజయ్ దేవరకొండ

తమ్ముడి తొలి సినిమా పూజా కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, టీజర్, ఫస్ట్‌లుక్‌లపై స్పందించక పోవడానికి కారణం ఇండస్ట్రీలో తనకు తానుగా ఎదగాలనే ఒక్క కారణమే అని పేర్కొంటూ లోలోపల కుమిలిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ కంట కన్నీరు చూసిన అతని తల్లి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం అంతా సైలెంట్ అయింది. దీంతో ఆ వెంటనే తిరిగి తనలో తానే దైర్యం తెచ్చుకొని తిరిగి స్పీచ్ ప్రారంభించాడు విజయ్ దేవరకొండ.

ఇదో ప్రమోషన్ టెక్నిక్.. విజయ్‌పై ట్రోల్స్

ఇదో ప్రమోషన్ టెక్నిక్.. విజయ్‌పై ట్రోల్స్

విజయ్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఎమోషనల్ స్పీచ్ చూసి తెగ షేర్స్ చేసుకున్నారు నెటిజన్లు. అయితే ఈ స్పీచ్ విన్న కొందరు మాత్రం ఇదో ప్రమోషన్ టెక్నిక్ మాత్రమే అని కొట్టిపారేస్తుండటం గమనార్హం. ఈ మేరకు విజయ్ ని కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం అలాంటి ట్రోల్స్ పై విరుచుకు పడుతూ విజయ్ దేవరకొండను సపోర్ట్ చేస్తున్నారు.

 దొరసాని మూవీ

దొరసాని మూవీ

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'దొరసాని'. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X