Roja బెంగళూరు పబ్‌లో రోజా వీడియో వైరల్.. నైటీ వేసుకు పో కామెంట్స్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్!

సినీ నటి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి రోజా సెల్వమణి మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల కాలంలో రకరకాల సంఘటనలు, కామెంట్ల కారణంగా ఆమెపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రోజా సెలబ్రేషన్స్‌ వివాదంగా మారాయి. అయితే ఆమె తీరును నెటిజన్లు, ముఖ్యంగా ఓ పార్టీ సానుభూతిపరులు ఘాటుగా స్పందిస్తున్నారు. పబ్‌లో రోజా వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bangalore Pub లో Roja.. నైటీ వేసుకు పో కామెంట్స్‌పై దారుణంగా ట్రోలింగ్ | Telugu Filmibeat

గత వారం రోజులుగా మంత్రి రోజా సోషల్ మీడియాలో ఫుల్ స్పేస్ సొంతం చేసుకొంటున్నారు. ఆంధ్రాలో ఆటాడుకొందాం రా అనే కార్యక్రమంలో ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రికెట్ బ్యాటింగ్ నేర్పించడం వైరల్ అయింది. రోజా, జగన్ వీడియో‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్సాటాగ్రామ్ రీల్స్‌లో విస్తృతంగా ప్రచారమైంది.

Netizens trolling Minister Rojas Bangalore Pub Video amid New Years Celebrations

ఇక నూతన సంవత్సర వేడుకలను మంత్రి రోజా ఘనంగా జరుపుకొన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేస్తూ,, పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించారు.

అయితే బెంగళూరు పబ్‌లో రోజా డ్యాన్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మంత్రిగా ఉండి పబ్‌లో చిందులేమిటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? బెంగళూరు పబ్బులో చిందులు వేస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Netizens trolling Minister Rojas Bangalore Pub Video amid New Years Celebrations

ఇక గతంలో అఖిల ప్రియ భూమాపై రోజా చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలుగు వాళ్లకు ఓ సంప్రదాయం ఉంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో సంప్రదాయంగా ఉండాలి. మంత్రిగా చుడీదార్ వేసుకొని రావడం తప్పు. ప్రజాసేవలో లేకపోతే నైటీ వేసుకొన్న పర్వాలేదు. ఎవరూ పట్టించుకోరు అని రోజా ఘాటుగా కామెంట్ చేశారు.

తాజాగా బెంగళూరు పబ్‌లో రోజా వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గతంలో మాట్లాడిన వీడియోలను పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉండి చేసిందేమిటి అని నిలదీస్తున్నారు. నీతులు చెప్పే ముందు వాటిని ఆచరించాలని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X