Telangana Elections 2023 ఓటు వేసేందుకు వచ్చి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి... ఆటడేసుకుంటున్న మీమర్స్

నవంబర్ 30వ తేదీ ఉదయం ఏడు గంటలకు మొదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఎట్టకేలకు ఐదు గంటల సమయంలో ముగిసింది. ఇక సాయంత్రం 5 గంటల వరకు సుమారు 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెబుతుండగా అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 40 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అంచనా. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో చిరంజీవితో ఓ సరదా సంఘటన హాట్ టాపిక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

గురువారం టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఓటు వేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముందుగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున అక్కినేని, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, దర్శకులు రాజమౌళి -సుకుమార్, హీరోలు నాగ చైతన్య, నితిన్, సుధీర్ బాబు, సాయి ధరమ్ తేజ్ మరియు రానా ఉన్నారు.

Recommended Video

Telangana Polling: ఓటర్ల దెబ్బకు క్యూలో నిల్చొని ఓటు వేసిన Megastar చిరంజీవి | Telugu OneIndia

Netizens Trolling on Chiranjeevi About His Mounavratham in Telangana Assembly Elections 2023 Full Details Here

ఓటింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే చిరంజీవి, ఎన్టీఆర్, అర్జున్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్నందున వారు జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్‌లలో ఓటు వేశారు. ఇక ఉదయమే ఓటు వేయడానికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవితో ఎన్నికల సరళి, ఆయన అభిప్రాయం గురించి మాట్లాడించడానికి ఓ న్యూస్ ఛానల్ విలేకరి విఫలయత్నం చేయగా సదరు మీడియా ప్రతినిధికి చిరు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

ఆ విలేఖరితో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు. అదేంటంటే... మెగాస్టార్ మౌన వ్రతంలో ఉన్నారట. ఈ విషయం స్వయంగా చిరంజీవి చెప్పారు. భార్య సురేఖ, కూతురు శ్రీజలతో కలిసి ఓటు వేయడానికి క్యూ లైనులో నిలబడ్డారు చిరంజీవి. అయితే ఆయన దగ్గరకు ఓ మీడియా ప్రతినిధి వెళ్లారు. ఇక అక్కడ చిరంజీవికి కొన్ని ప్రశ్నలు వేయగా... 'మౌనవ్రతం' అని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత కూడా మరో ప్రశ్న వేయగా గొంతు మీద చెయ్యి చూపిస్తూ విలేకరిని వెనక్కి పంపించారు ఆయన.

Netizens Trolling on Chiranjeevi About His Mounavratham in Telangana Assembly Elections 2023 Full Details Here

ఇక ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాను మౌనవ్రతంలో ఉన్న అని స్వయంగా చెప్పి చిరంజీవి దాన్ని బ్రేక్ చేసినట్టు సోషల్ మీడియాలో నెటిజనులు పోస్టులు చేస్తున్నారు. 'బాస్ మౌనవ్రతం అని బాసే చెప్పడం ఏంటో అంటూ చర్చించుకుంటున్నారు. ఇక చిరుపై మీమర్స్ జోక్స్ పేలుస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే... ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లితో కలిసి పోలింగ్ కేంద్రంలో కనిపించారు. చిరంజీవి తన భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి ఎన్నికలకు వచ్చారు. రవితేజ, నాని, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, జగపతి బాబు, సుమంత్, గోపీచంద్, ప్రియదర్శి, సుమ కనకాల తదితరులు మధ్యాహ్నం ఓటేశారు. అయితే ఎక్కడున్నారో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం ఓటు వేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X