AP Elections పాపం వంగా గీత.. ఎర్ర కండువా చూసి భయంతో ఓటరుపై ఆగ్రహం.. నెటిజన్లు భారీగా ట్రోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నియోజకవర్గంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా భారీగా ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఎక్కడా లేని విధంగా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఓటు వేసేందుకు ఓపికగా నిలుచున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత అసహనం, ఆగ్రహంతో పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ కనిపించింది. అయితే ఒక ఓటరుపై ఆమె కోపంతో ఊగిపోతూ..
జనసేన అభిమానులు, కార్యకర్తలు ఎర్ర కండువాను ధరించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఆ పార్టీకి ఎలాంటి సింబల్ కాదనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఓటింగ్ కేంద్రంలోకి ఎర్ర కండువా ధరించి వచ్చిన యువకుడిపై వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కండువా ధరించి ఓటింగ్‌కు రావొద్దని కోపగించింది.

అయితే ఎర్ర కండువా జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ యువకుడు వాగ్వాదానికి దిగాడు. దాంతో మన పార్టీ జెండాలను తీసుకొచ్చి మెడలో వేసుకోండి అంటూ వంగా గీత అనడం వీడియోలో కనిపించింది. దాంతో ఎలక్షన్ అధికారులు గొడవ ఎందుకు అంటూ ఓటరు మెడలోని ఎర్ర కండువాను తీసేయించారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

ఎర్ర కండువాను చూసి వంగా గీత భయపడి పోయింది. టవల్ చూసి భయపడిపోతారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలా అయితే ఓటింగ్ కేంద్రంలో పలుచోట్ల ఫ్యాన్స్ ఉన్నాయి. వాటిని కూడా తొలగించండి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే చిన్న గుడ్డ పేగు చూసి భయపోవడం ఎందుకు మేడమ్.. వీడియో కింద భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. క్యూలైన్‌లోకి ఉన్న ఓటర్లకు దండం పెడుతూ.. గుర్తుంచుకోండి అంటూ ప్రాధేయపడటంపై ఓటరు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇలా క్యూలైన్‌లో ప్రచారం చేయవద్దని తెలియదా? అంటూ ఆమెను నిలదీశాడు. దాంతో ఆమె నా ఓటు ఎక్కడ ఉందో చూద్దామిన వచ్చాను. అప్పటి వరకు బయట ఉంటాను అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే పలు కేంద్రాల్లో వంగా గీత ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతుందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలోకి వచ్చి ఆమె తనకు ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చాలా కేంద్రాల్లో మహిళలు జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











