పవన్ కల్యాణ్‌పై దారుణమైన కామెంట్స్.. యాంకర్ శ్యామలను ట్రోల్స్‌తో ఆటాడుకొంటున్న నెటిజన్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంటరిగా బరిలో దిగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జనసేన-బీజేపీల మద్ధతుతో ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాలు తమ తమ అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సహజంగానే సినీ పరిశ్రమకు , రాజకీయాలకు అవినాభావ సంబంధం ఏనాటి నుంచో కొనసాగుతోంది కాబట్టి.. షరా మామూలుగానే సినీ ప్రముఖులు కొందరు ఇరు శిబిరాల్లోనూ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.
వైసీపీ తరపున స్టార్ యాంకర్, సినీనటి శ్యామల ప్రచారం చేస్తున్నారు. వాడి వేడి విమర్శలతో ఆమె సభల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై పరోక్ష విమర్శలు చేశారు శ్యామల. '' ముసలి తోడేలు - గుంట నక్క '' అంటూ ఆమె చెప్పిన కథ వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి శ్యామలకు గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.

ఇంతకీ.. శ్యామల చెప్పిన కథేంటి అంటే, ''అనగనగా ఒక పెద్ద అడవి.. ఆ అడవిలో ఓ ముసలి తోడేలు, దానికి వేటాడే ఓపిక లేకపోవడంతో బతకడానికి, తనకు ఆహారాన్ని తెచ్చిపెట్టడానికి ఓ గుంటనక్క సాయం కోరింది. ఆ తోడేలుకు సాయం చేయకపోతే తననెక్కడ తినేస్తుందోనని ఆ గుంటనక్క సరే అంటుంది. తోడేలుకు ఆహారం సంపాదించాలని, ఈ గుంటనక్క అడవి మొత్తం గాలిస్తుంది. కనిపించిన ప్రతి జంతువుకు ఆ తోడేలు గురించి చెబుతుంది. కొన్ని జంతువులు ఈ గుంటనక్క మాటలు వింటే.. ఇంకొన్ని తెలివైన జంతువులు మాత్రం పట్టించుకోవడం లేదు ''.
'' పాపం ఓ బుజ్జి కుందేలు మాత్రం ఈ గుంటనక్క మాటలకు దొరికిపోయింది. నువ్వు మాతో వుంటే నిన్ను ఉద్దరిస్తాం.. రాజభోగాలు కట్టబెట్టేస్తాం, ఈ అడవి మొత్తం నీదేనని కుందేలుతో గుంటనక్క చెబుతుంది. దానిని వెంటబెట్టుకుని తోడేలు దగ్గరకు వస్తుంది నక్క. అసలే ఆకలితో వున్న తోడేలు కుందేలుపై పడి దాని చెవులను కొరికి తినేసింది. దీంతో కుందేలుకు ఏం అర్ధం కాక, భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే కుందేలు ఎక్కడ పారిపోతోందనని భయపడి ఆ గుంటనక్క దానిని పట్టుకుని ఆపి.. నీకు తలపై పెద్ద కిరీటం పెట్టాలని అనుకుంటున్నాం, అది పెట్టాలంటే నీ చెవులు అడ్డంగా వున్నాయి. అందుకే వాటిని కోసేశాం అని చెప్పింది ''.
'' ఆ మాటలు నమ్మిన కుందేలు మళ్లీ తోడేలు దగ్గరికి వెళ్లగా.. ఈసారి కుందేలు తోకను కొరికేసింది. కుందేలుకి మళ్లీ ఎక్కడో తేడా కొట్టి.. పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో మళ్లీ గంటనక్క వచ్చి .. నీకోసం సింహాసనం రెడీ చేశాం, దానిపై కూర్చోవాలంటే తోక అడ్డొస్తుందని అందుకే తోక కట్ చేశాం.. రారా అని చెబుతుంది. పాపం పిచ్చి కుందేలు మరోసారి గుంటనక్క మాట విని.. తోడేలు దగ్గరికి వస్తుంది. చివరికి ఆ ముసలి తోడేలు .. కుందేలు పీకని కొరికేస్తుంది. మనకి ఆహారం దొరికేసింది.. వెళ్లి కట్ చేసి తీసుకురా అని తోడేలు.. నక్కకి చెబుతుంది ''.

దీనికి సరేనన్న గుంటనక్క కుందేలుని కట్ చేస్తూ.. దాని మెదడుని తోడేలుకు తెలియకుండా తినేస్తుంది. మాంసం తీసుకుని తోడేలు వద్దకు వెళ్లగా.. దీని బుర్ర ఏమైంది అని అడుగుతుంది తోడేలు. ఆ బుర్రే ఉంటే మనం చెప్పిన మాటల్ని ఈ కుందేలు ఎందుకు నమ్ముతుందని చెబుతుంది గుంటనక్క. ఆ వెంటనే తోడేలు, గుంటనక్క నవ్వుకుంటాయి. ఈ కథలో ముసలి తోడేలు ఎవరనేది తాను అడగను.. ఈ గుంటనక్క ఎవరనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. నేను చెప్పేది ఒకటే.. సరిగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోండి. వాళ్లు చెప్పే మాటల్ని నమ్మొద్దు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. 2019, 2014 మేనిఫెస్టోలను పట్టుకుని సీఎం జగన్ తిరుగుతున్నారు. నాకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పగలిగే దమ్మున్న నాయకుడు జగన్.. ఆయనని గెలిపించడానికి శ్యామల ఎప్పుడూ సిద్ధమే. ఏపీ ప్రజలంతా సిద్ధంకండి అంటూ ఆమె పిలుపునిచ్చింది.
అయితే శ్యామల పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆ రెండు పార్టీల కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్స్‌తో ఆడుకుంటున్నారు. హైదరాబాద్‌లో వుండే నీకు, ఏపీలో జరిగే విషయాలు తెలియవంటూ శ్యామలకు చురకలంటిస్తున్నారు. మరికొందరు శ్యామల భర్త నర్సింహారెడ్డిపై గతంలో నమోదైన చీటింగ్ కేసును, శ్యామల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ నువ్వు మాకు నీతులు చెప్పొద్దని కామెంట్ చేస్తున్నారు . మరి వీటిపై శ్యామల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











