నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయింది.. సారంగదరియాపై కోమలి.. నెటిజన్ల ట్రోలింగ్

గతేడాది ఆచార్య సినిమాపై చెలరేగిన వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. దాన్ని మించిన హై డ్రామా సారంగ దరియా చుట్టూ తిరిగింది. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన పాట సారంగ దరియా. అది తెలంగాణ జానపదం. అవి ఎన్నో ఏళ్లుగా ఇక్కడి మట్టిలో ఉన్నాయి. కానీ సారంగ దరియాను మొదటగా వెలికి తీసి పాడింది కోమలి అనే జానపద గాయని. రేలారేలారే ప్రోగ్రాంలో కోమలి ఈ పాటను పాడింది. కానీ సుద్దాల అశోక్ తేజ అందులోని పల్లవిని తీసుకుని పాట రాసేశాడు. అలా అక్కడితో వివాదం మొదలైంది.

నాదంటే నాది..

నాదంటే నాది..

సారంగదరియా పాట నాదంటే నాది అని కోమలి, మరో గాయని శిరీష వాగ్వాదానికి దిగారు. అది జానపద గేయం అందరికీ హక్కు ఉంటుందని సుద్దాల అశోక్ తేజ అన్నాడు. అలా చిలికి చిలికి ఆ వివాదం గాలి వానలా మారిపోయింది.

మీడియాకెక్కి కోమలి..

మీడియాకెక్కి కోమలి..

సారంగదరియా వివాదం ముదిరిపోయిన సమయంలో కోమలి మీడియాకెక్కింది. పలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. అసలు తనకు ఏం తెలియదని, తనను కనీసం సంప్రదించలేదు, ప్రోమో విడుదలయ్యాక కాల్ చేశారని కోమలి చెప్పుకొచ్చింది.

 మంగ్లీ కంటే..

మంగ్లీ కంటే..

మంగ్లీ పాడిన పాట బాగా లేదని, తాను పాడితేనే దానికి అందం వస్తుందని కోమలి చెప్పుకొచ్చింది. తనకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని, సినిమాలో తానే పాడతానని రకరకాలుగా డిమాండ్స్ చేసింది. చివరకు శేఖర్ కమ్ముల దిగొచ్చి వివాదానికి ముగింపు పలికాడు. రానున్న చిత్రంలో పాడిస్తామని, సారంగ దరియాకు క్రెడిట్ కూడా ఇస్తామని శేఖర్ కమ్ముల మాటిచ్చాడు.

 తాజాగా అలా..

తాజాగా అలా..

ఇప్పుడు బుల్లితెర, పలు సినిమా ఈవెంట్లలో కోమలికి అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఓ ఈవెంట్‌లో కోమలి సారంగదరియాను పాడింది. ఆ తరువాత కాస్త ఎక్కువగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వదిలిన ప్రోమో వైరల్ అవుతోంది. జీ వారి పాట ఈవెంట్‌లో కోమలి మాట్లాడుతూ.. లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయిందని అనిపిస్తోంది అంటూ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది.

నెటిజన్ల ట్రోలింగ్..

నెటిజన్ల ట్రోలింగ్..

పదే పదే నా పాట నా పాట అనడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అది జానపదం ఎప్పటి నుంచో ఉందని.. నువ్ మొదటగా పాడావ్ అంతే.. అని కౌంటర్లు వేస్తున్నారు. పైగా మంగ్లీ పాడింది కాబట్టే అంత హిట్ అయింది.. సినిమాలో నువ్ పాడితే ఇంత క్లిక్ అయ్యేది కాదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మంగ్లీ వాయిస్‌తో పోల్చుకోకు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X