Adipurush: ప్రభాస్ సినిమాలో జీసస్.. ఆ సీన్‌పై దారుణమైన ట్రోల్స్.. వాళ్లు కూడా వదలట్లేదుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో కనీవినీ ఎరుగని రికార్డులను క్రియేట్ చేసి.. ఇప్పుడు బాలీవుడ్‌పై నేరుగా దండయాత్ర చేయడానికి సిద్ధం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామాయణం నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఈ మూవీలోని ఓ సీన్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీరే చూడండి!
రాఘవుడిగా ప్రభాస్ ఎంటర్:ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు.

వరల్డ్ వైడ్‌గా ట్రెండింగ్‌లోనే:క్రేజీ కాంబోలో రూపొందిన 'ఆదిపురుష్' మూవీని రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధ కాండలతో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. అయితే, ఇందులో ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, దీని నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయింది.

గ్రాండ్ రిలీజ్.. అదే సందడి:విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'ఆదిపురుష్' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ ప్రభాస్ అభిమానులతో, 'జై శ్రీరామ్' నినాదంతో మోగిపోతున్నాయి.

అంతటా రిలీజ్... టాక్ ఇలా:డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం మంచిగానే వస్తోంది. ఎక్కువ శాతం మంది ఈ చిత్రాన్ని 3Dలోనే చూడాలని సూచిస్తున్నారు.
ఆదిపురుష్ ఆ సీన్ వైరల్‌గా:సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత.. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అందులోని సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆదిపురుష్' మూవీలోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ సినిమాలోని అయోధ్య సీన్ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.
ఆదిపురుష్‌లో జీసస్ అని:టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్'లో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. ఈ మూవీలో అతడు అయోధ్యలో తన తండ్రితో మాట్లాడుతున్న సన్నివేశంలో కొత్తరకమైన గెటప్‌తో దర్శనమిచ్చాడు. దీన్నే సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న నెటిజన్లు 'ఆదిపురుష్‌లో జీసస్ ఏంటి', 'ఆదిపురుష్ సినిమాలో సీమోను ఎలా వచ్చాడు' అని ట్రోల్స్ చేస్తున్నారు.
ఆ భాషల్లోనూ దారుణంగా:'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ కనిపించిన గెటప్‌పై వేరే భాషల వాళ్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓ తమిళ నెటిజన్ 'ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడిని చూపిస్తారనుకుంటే.. జీసస్‌ను చూపించారేంటి' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఈ సన్నివేశంపై చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. దీన్ని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











