Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!
ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయినా.. పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇలా ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కుతోంది. అదే సమయంలో ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఏంటా సీన్? అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

వీర సింహా రెడ్డిగా వచ్చిన బాలయ్య
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందిన చిత్రమే 'వీరసింహారెడ్డి'. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని ఇచ్చాడు.

క్రేజీ కాంబినేషన్.. భారీ అంచనాలే
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వీర సింహా రెడ్డి' మూవీని గతంలో మాదిరిగానే రీవేంజ్ స్టోరీతో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. అయితే, ఇందులో ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగా ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, దీని నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి.

గ్రాండ్ రిలీజ్... థియేటర్లలో రచ్చ
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'వీర సింహా రెడ్డి' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి.

అంతటా విడుదల.. అలాంటి టాక్
మాస్ కాంబోలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

బాలయ్య మూవీలో ఆ సీన్ వైరల్‌గా
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అందులోని సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' మూవీలోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ సినిమాలోని ఓ కార్ సీన్ తెగ వైరల్ అయిపోతోంది.

బాలకృష్ణ దెబ్బకు ఎగిరి పడ్డ కారు
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీలో బాలయ్య రెండు పాత్రలను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో వీర సింహా రెడ్డి రోల్‌ను ఎలివేట్ చేసే సమయంలో ఓ ఫైట్ సన్నివేశంలో బాలయ్య కారును కాలితో తన్నగానే అది గాల్లోకి ఎగిరి మళ్లీ కింద పడుతుంది. దీంతో ఈ సన్నివేశంపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తున్నారు.

మరో పల్నాటి బ్రహ్మానాయుడని
'వీర సింహా రెడ్డి' మూవీలో నందమూరి బాలకృష్ణ కారును తన్నిన సన్నివేశాన్ని చాలా మంది ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో అటు దర్శకుడు గోపీచంద్‌పై, ఇటు హీరో నటసింహంపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా రోజులను గుర్తు చేసినట్లు అయిందని కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











