Urvashi Rautela: బేషరం పాటతో ఊర్వశి టెంప్టింగ్.. నీ అందానికి రిషబ్ పంత్ ను కొల్లగొట్టావు అంటూ ట్రోలింగ్!

గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె ముఖ్యంగా కొత్త సినిమాలకు సంబంధించిన హిట్ సాంగ్స్ వస్తే మాత్రం వాటిపై ఆమె రీల్స్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా బేషరం పాటకు ఆమె ఇచ్చిన హావ భావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నేటిజన్స్ చేసిన కామెంట్స్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.

బాస్ పార్టీలో అలా..

బాస్ పార్టీలో అలా..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఊర్వశి ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ బ్యూటీ బాస్ పార్టీ అనే పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.

పఠాన్ పాటతో రీల్

పఠాన్ పాటతో రీల్

ఇక ఊర్వశి సోషల్ మీడియాలో చాలా హడావిడిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో లేదా ఫోటోతో తన ఫాలోవర్స్ ను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల పోస్ట్ చేసినా ఒక వీడియో అయితే వైరల్ గా మారింది. షారుక్ ఖాన్ దీపిక పదుకొనే నటించిన పటాన్ సినిమాలోని బేషరం పాటకు తనదైన శైలిలో హావభావాలు చూపించింది.

 అలాంటి పాటకు స్టెప్పులు లేకుండా..

అలాంటి పాటకు స్టెప్పులు లేకుండా..

ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువగా వైరల్ అయిన పాటలలో ఈ పాట ఒకటి. ఆ పాటలో దీపిక పదుకొనే అందాల విందులో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి పాటకు ఊర్వశీ ఎలాంటి స్టెప్పులు వేయకుండా కేవలం తన చూపులతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్

ఇక ఊర్వశి ఆ విధంగా పర్ఫామెన్స్ ఇవ్వడంతో నేటిజన్స్ కూడా ఊహించని స్థాయిలోనే ట్రోలింగ్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అతను ఈ పాట చూస్తే ఏమైపోతాడో అని అలాగే నీ చూపులను చూసిన తర్వాత అతను లేచి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంతేకాకుండా నీ పాటతో అతన్ని కొల్ల గొట్టావు అని కూడా మరి కొందరు సరదాగా డ్రోలింగ్ చేస్తున్నారు.

ఏదో నడుస్తోంది..

ఏదో నడుస్తోంది..


ఊర్వశి, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్యలో ఏదో కొనసాగుతోంది అని గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకరు చేసిన పోస్ట్ కు మరొకరు కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్స్ కూడా చేసుకున్నారు. ఇటీవల రిషబ్ ఒక ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఇక అతను కొలుకోవాలి అని ఆమె ఇన్ డైరెక్ట్ గా కొన్ని పోస్టులు కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X