Netrikann Movie Review: ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన నయనతార.. విలన్‌‌గా ఎవరంటే?

Rating:
3.0/5
Star Cast: నయనతార, అజ్మల్ అమీర్, మణికందన్ ఆర్ ఆచారీ, శరణ్ శక్తి
Director: మిలింద్ రావ్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో నయనతార లేడి సూపర్‌స్టార్‌గా తనకంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నది బిగిల్, దర్బార్, నిహల్. అమ్మోరు తల్లి లాంటి చిత్రాలతో ఫెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నది. కొరియా భాషలో విశేషంగా ఆకట్టుకొన్న బ్లైండ్ సినిమాను ఆధారంగా చేసుకొని రూపొందించిన నేత్రికన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదల కావడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజైంది. నయనతారకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించింది? లేడీ సూపర్ స్టార్ ఖాతాలో మరో హిట్ చేరిందా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా కథా, కథనాలను సమీక్షించాల్సిందే...

నేత్రికన్ కథ ఏమిటంటే...

నేత్రికన్ కథ ఏమిటంటే...

దుర్గ (నయనతార) ఓ సీబీఐ ఆఫీసర్. ఓ యాక్సిడెంట్‌లో తన సోదరుడు ఆదిత్యతోపాటు తన చూపును కోల్పోతుంది. ఇదిలా ఉండగా డాక్టర్ జేమ్స్ (అజ్మల్ అమీర్) గైనకాలజిస్ట్. అమ్మాయిలను మోసగిస్తూ తన కోరికలను తీర్చుకొంటుంటాడు. ఈ క్రమంలో అమ్మాయిలు తప్పిపోయారనే ఫిర్యాదులు పోలీసులకు అందుతాయి. అర్ధరాత్రి కారు కోసం వెయిట్ చేస్తున్న దుర్గను జేమ్స్ ట్రాప్ చేస్తాడు. తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తే తప్పించుకొంటుంది?

నేత్రికన్‌లో ట్విస్టులు

నేత్రికన్‌లో ట్విస్టులు

తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించిన డాక్టర్ జేమ్స్ ఫిర్యాదు చేసిన దుగ్గ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నది? తన సోదరుడు యాక్సిడెంట్‌లో కోల్పోవడానికి కారణం ఏమిటి? గైనకాలజిస్ట్ జేమ్స్ ఎందుకు అమ్మాయిలను ట్రాప్ చేశాడు? డాక్టర్‌గా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి అమ్మాయిలను ఎందుకు మోసం చేస్తున్నాడు? జేమ్స్ జీవితంలో జరిగిన సంఘటన ఏమిటి? జేమ్స్‌కు ఎలాంటి శిక్ష పడేలా నయనతార చేసింది? చివరకు నయనతారకు కళ్లు వచ్చాయా? అనే ప్రశ్నలకు సమాదానమే నేత్రికన్ సినిమా కథ.

అంధురాలిగా ఇరుగదీసిన నయనతార

అంధురాలిగా ఇరుగదీసిన నయనతార

దుర్గ అనే అంధురాలి పాత్రలో నయనతార పెర్ఫార్మెన్స్‌తో మరోసారి అదరగొట్టింది. పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ప్రతీ సన్నివేశాన్ని అద్బుతంగా పండించింది. ముఖ్యంగా అంధురాలిగా కనిపించేందుకు తీసుకొన్న జాగ్రత్తలు, అలాగే బాడీ లాంగ్వేజ్ సూపర్‌ అనిచెప్పవచ్చు. గ్లామర్‌కు ఏ మాత్రం స్కోప్ లేని పాత్రలో తన నటనను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నయనతార యాక్టింగ్ అద్బుతంగా ఉంది. మరోసారి లేడి సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ను నిజం చేసిందని చెప్పవచ్చు.

విలన్‌గా అమీర్ అజ్మల్ సినిమాకు బలం

విలన్‌గా అమీర్ అజ్మల్ సినిమాకు బలం

ఇక నేత్రికన్ పాత్రలో ఎక్కువగా పాత్రలకు స్కోప్ లేకపోయింది. మఖ్యంగా అమీర్ అజ్మల్ మరోసారి విలన్ పాత్రను అద్బుతంగా పండించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో నటనాపరంగా ఆకట్టుకొన్నాడు. బాడీ లాంగ్వేజ్, లుక్ బాగుంది. సాఫ్ట్ విలనిజంతో సినిమాను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చాడు. ఇక సోదరుడు ఆదిత్య పాత్రకు కొంత స్క్రీన్ టైమింగ్ ఉండటంతో పెద్దగా ఆ పాత్రకు స్కోప్ లేకపోయింది. స్విగ్గీ, జోమాటో లాంటి డెలీవరీ బాయ్‌గా గౌతమ్ ఆకట్టుకొన్నాడు. అలాగే పోలీస్ ఎస్సై మణికంఠన్ ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రల్లో నటీనటులు తమ పరిధి మేరకు ఒకే అనిపించారు.

దర్శకుడిగా మిలింద్ రావ్

దర్శకుడిగా మిలింద్ రావ్

సస్సెన్స్, ఎమోషనల్ చిత్రాలకు పెట్టింది పేరైన మిలింద్ రావు మరోసారి తన ప్రతిభను నిరూపించుకొన్నాడు. కొరియన్ సినిమాను ఆధారంగా చేసుకొని కథ, కథనాలను దక్షిణాది ప్రేక్షకులకు అనుగుణంా మార్చుకోవడంలో సఫలమయ్యారు. నయనతార పాత్రను, అలాగే సపోర్టింగ్ రోల్స్ గౌతమ్, మణికంఠ పాత్రలను బాగా డిజైన్ చేశాడు. ఆద్యంతం సినిమాను ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో ప్రతీ సీన్ సీన్‌కు క్యురియాసిటీని పెంచేలా తెరక్కించారు. సినిమాను పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా మార్చడంలో తన మార్కును చూపించాడు. క్లైమాక్స్‌లో కాస్త రొటీన్ అంశాలు ఎక్కువయ్యాయనే వాదనను తప్పించుకోలేకపోయాడని చెప్పవచ్చు.

సినిమా ఎలా ఉందంటే..

సినిమా ఎలా ఉందంటే..

నేత్రికన్ చిత్రం ఓ యాక్సిడెంట్‌తో ఎమోషనల్‌గా మొదలువుతుంది. భావోద్వేగమైన సన్నివేశాలతో కత సాగుతుంది. నయనతార యాక్టింగ్‌కు తోడుగా అజ్మల్ అమీర్ విలన్ పాత్ర ఈ సినిమాకు బలంగా మారడంతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నయనతార, అజ్మల్ మధ్య పోటాపోటీగా సాగే సన్నివేశాలు సినిమాను పరుగు పెట్టించేలా చేసింది.

సెకండాఫ్‌లో సినిమా మరింత గ్రిప్పింగ్‌గా సాగడంతో ప్రేక్షకుడిలో మరింత ఆసక్తిని కలిగించిందని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో డిఫరెంట్‌గా చూపించడానికి అవకాశం లేకపోవడంతో కథ డిమాండ్ మేరకు మూవీ రొటీన్‌గా మారడం తప్పలేదు. ఓవరాల్‌గా ఫెర్పార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమాను చూసిన తృప్తి ప్రేక్షకుల్లో మిగలడం గ్యారెంటీ. నిర్మాతగా నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్రేష్ శివన్ ఓ మంచి చిత్రాన్ని అందించాడు. నయనతారను తన కెరీర్‌లో ఉత్తమ పాత్రలో చూపించాడని చెప్పవచ్చు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

నయనతార ఫెర్ఫార్మెన్స్, అజ్మల్ యాక్టింగ్ ప్రతిభతోపాటు ఎమోషనల్ అంశాలు కలబోసిన చిత్రంగా నేత్రికన్‌ను చూడవచ్చు. అశ్లీలత, అసభ్యతతో కూడిన సినిమాలు వస్తున్న ఈ నేపథ్యంలో ఫ్యామిలీ అంతా చూడదగిన సినిమాగా ఈ చిత్రాన్ని మిలింద్ రావు రూపొందించారు. నయనతార ఎలక్ట్రిఫైయింగ్ ఫెర్ఫార్మెన్స్ మరింత ఆకట్టుకొంటుంది. ఓటీటీలోనే రిలీజ్ అయింది కాబట్టి కుటుంబమంతా కలిసి ఈ వారాంతంలో ఎంజాయ్ చేయగలిగిన చిత్రమని చెప్పవచ్చు. కాబట్టి నయనతార దుర్గగా ఎలా రాణించిందో మీరే చూడండి.. ఇక ఆలస్యం ఎందుకు.. సో ఎంజాయ్ ది నేత్రికన్ మూవీ.

Recommended Video

Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak Sen
నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: నయనతార, అజ్మల్ అమీర్, మణికందర్ ఆర్ ఆచారీ, శరణ్ శక్తి
దర్శకత్వం: మిలింద్ రావు
నిర్మాత: విఘ్నేష్ శివన్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్: గోపాలకృష్ణన్
బ్యానర్: రౌడీ పిక్చర్స్ ఇంక్, క్రాస్ పిక్చర్స్ ఇంక్
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్
ఓటీటీ రిలీజ్ డేటే: 2021-08-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X