For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తేల్చేసారు : 'బాహుబలి-2 ' కోసం ఆమె ను అసలు అడగనేలేదు

  By Srikanya
  |

  హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా 'బాహుబలి 2' గురించి రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులు క్రితం బాహుబలి-2లో మాధురి దీక్షిత్ నటించేందుకు ఓకే అన్నట్టు టాక్ వచ్చింది. ఇందులో ఆమె అనుష్క సిస్టర్‌గా, కుంతలరాజ్యం మహారాణిగా కనిపించబోతోందని చెప్పుకున్నారు. త్వరలో ఈ విషయమై అఫీషియల్‌గా స్టేట్‌మెంట్ రానుందని ఎదురుచూస్తున్న సమయంలో అసలు తనను ఎవరూ ఈ విషయమై ఎప్రోచ్ కాలేదని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఖండిచి షాక్ ఇచ్చారు.

  విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ... " అటువంటి ఆలోచన ఏదీ మేం చేయలేదు. అసలు ఆమెను తీసుకోవాలనే ఐడియా కూడా మాకు రాలేదు. ఎవరైతే మీడియాలో ఇలాంటి న్యూస్ లు రాస్తున్నారో..వారు స్క్రీన్ రైటర్స్ కన్నా చాలా ఊహాశక్తితో ముందుకు వెళ్తున్నారు ," అన్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్‌జోహార్ 'బాహుబలి'ని హిందీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇదిలావుండగా మాధురీని ఓ రోల్‌కి తీసుకోవాలని రాజమౌళికి కరణ్ రిక్వెస్ట్‌ చేశాడట. ఈ క్రమంలోనే ఆమెను గెస్ట్ రోల్‌కి ఎంపిక చేసినట్టు ఇన్‌సైడ్ టాక్ మొదలైంది. కేవలం 10 నిమిషాల సేపు మాధురి కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. సెట్స్‌పైకి వెళ్లకముందే ఇంత హంగామా జరుగుతున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎలాంటి స్ధాయిని చేరుకుంటుందో చూడాలి.

   Never Approached Madhuri Dixit For Baahubali 2

  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

  గత కొద్ది రోజులుగా ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కు వెళ్తోంది. అందులో భాగంగా తైవాన్ లో జరగనున్న ఫెస్టివల్ కు ఈ చిత్రాన్ని పంపుతున్నారు. ఈ విషయాన్ని బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

  విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

  తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

  English summary
  Vijayendra Prasad, writer of the film, who also happens to be the father of Rajamouli, trashed the reports. Talking to a leading daily, he said that neither did they approach Madhuri Dixit for a role nor does such a character exists in the film. "We have no idea where this came from. The thought of casting her hasn't even entered our minds. It seems those who write media stories have more fertile imaginations than screenwriters," the 72 year old writer quipped.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X