మా నాన్న ఉన్నారు.. నన్నెవరూ బెదిరించలేదు అంటున్న హీరో

అలాగే..ధర్మేంద్ర కుమారుడినైనందున తనను ఎవరూ బెదిరించలేదని బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ చెప్పాడు. ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించిన ధర్మేంద్రను హీ-మ్యాన్ అని, హిందీ సినిమా యాక్షన్ కింగ్ అని పేర్కొంటూ ఉంటారు. ''ఆయన సూపర్‌మ్యాన్ లాంటివాడు. ఈ భూమిపై అత్యంత బలవంతుడు మా నాన్న అని అనుకునేవాడిని. ధర్మేంద్ర కొడుకునైనందున నన్నెవరూ బెదిరించలేదు'' అని బాబీ తెలిపాడు.
రెండో తరం డియోల్స్‌లో రెండవ వాడైన బాబీ ఏ సహాయం కావాలన్నా తండ్రివైపు చూస్తాడట. ఆ విషయం చెప్తూ.. ''తండ్రులెప్పుడూ సలహాలు ఇస్తారు. మా డాడీ కూడా ఇస్తాడు. అయితే చివరలో నిర్ణయం నాకే వదిలిపెట్టేవాడు. నీ మనసు ఏది చెబితే అది చేయమని చెప్తాడు. నా కెరీర్‌లో నేను ఈ మాటలను ఆచరిస్తున్నాను'' అని బాబీ చెప్పాడు. ధర్మేంద్ర నా తండ్రి అయినందుకు అదృష్టవంతుడినని బాబీ అన్నాడు.
ఇక తండ్రి ధర్మేంద్రతో కలిసి డియోల్ సోదరులు సన్నీ, బాబీలు 'యమలా పగ్లా దీవానా', 'అప్నే', 'సన్నీ' చిత్రాల్లో నటించారు. ధర్మేంద్రతో ఓ సంఘటనను సన్నీ గుర్తు చేసుకున్నాడు. ''డాడ్‌తో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. 'క్షత్రియ' సినిమాల్లో కత్తితో ఓ ఫైట్ సీన్ షూటింగ్ సందర్భంగా ప్రమాదవశాత్తు నేను ఆయన మోకాలిపై కొట్టాను. నేనెంతగా భయపడిపోయానంటే... అచేతనంగా మారిపోయి కిందపడిపోయాను'' అని చెప్పాడు. ఈ ముగ్గురు డియోల్‌లు కలిసి మరోమారు 'యమలా పగ్లా దీవానా-2'లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











