‘రక్తచరిత్ర’ కు ముగింపు లేదు!
హిందూ ముస్లిం డాన్‌ల కథలు తీశాను. దావూద్ ముస్లిం, చోటా రాజన్ హిందువు. వీరిద్దరూ మాఫియా డాన్‌లు. ఆ కథలు సినిమాగా తీస్తున్నట్లు ముందే తెలుసు. ఏం తీస్తారో ఎలా తీస్తారో అనే ఇంటరెస్ట్ ఉంటుంది. కంపెనీ సినిమా తీశాను. దానికి బెదిరింపులు వచ్చాయి. అయినా సినిమాగా తీశాను. ఇప్పుడు పరిటాల రవి కూడా అంతే. ఈ చిత్రం తీయడానికి ముందే ప్రకటన ఇస్తే చాలామంది నాకూ వార్నింగ్ ఇచ్చారు. అయినా సినిమాను సినిమాగానే తీయడమే నా ఉద్దేశ్యమని రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు.
ఇదొక 'నెవర్ ఎండింగ్ స్టోరి" అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఫ్యాక్షన్ గొడవలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. వీటికి ఎండింగ్ ఉండదు" అని దీని అర్థం. ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాం? ఎందుకిలా చేస్తున్నామని ఆలోచించేలా ఈ చిత్రముంటుందన్నారు. గత ఎనిమిది నెలలుగా 'రక్త చరిత్ర" గురించే ఆలోచిస్తున్నాను. నా లైఫ్ లో ఇంత ఎగ్జయిట్ మెంట్ అయిన సందర్బాలు లేవు. 'సత్య" కంపెనీ చిత్రాల మాదిరి ఇందులో పాజిటివ్ క్యారెక్టర్ ఏది ఉండదు. ఎవరు మంచోళ్లు ఎవరు చెడ్డోళ్లు అని చెప్పులేం" అన్నారు. 'రక్తచరిత్ర" రెండు పార్టులుగా రూపొందుతోంది. 15 రోజుల వ్యవధిలో ఈ రెండు పార్టులూ వచ్చే వేసవిలో విడుదలకానున్నాయి. సహజత్వానికి దగ్గరగా అనంతపురం, హైదరాబాద్ లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలో ఉన్నట్లే ఇక్కడ, అన్నలు, తమ్ములు, వంశం, దాయాదులు వంటి అంశాలున్నాయి. పూర్వీకులు వర్తమానం కూడా ఉంది. అందుకే మహాభారతంతో పోలుస్తూ టైటిల్ సాంగ్ చేశాను. అది సినిమాకు హైలెట్ అవుతుంది. ఆ గీతాన్ని 'కలువ సాయి" రాశారు. సంగీతాన్ని బాపీటోటక్ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











