twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి...

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు పరిశ్రమలో ఉన్న స్టార్ డైరక్టర్స్ ల్లో పూరి జగన్నాథ్ డి కాస్త డిఫరెంట్ స్టైల్. ఏది చేసినా కాస్త కొత్తగా, రిచ్ గా ఉండేలా చేస్తాడాయన. మరీ ముఖ్యంగా సినిమాలకి కథలు రాసేటప్పుడు ఆయనసలు ఇండియాలోనే ఉండరు. చక్కగా బ్యాంకాక్ వెళ్ళిపోయి 10 - 15 రోజుల్లో పూర్తి కథను రాసుకొచ్చేస్తారు.

    అలా బ్యాంకాక్ లో ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న సూపర్ హిట్ కథలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం 'ఇజం' షూటింగ్ పార్ట్ ముగించేసిన అయన ఎన్టీఆర్ కోసం కథ రాయడానికి బ్యాంకాక్ లో సిట్టింగ్ వేస్తారు. బ్యాంకాక్ తనకు రెండో ఇల్లు అని స్వయంగా చెప్పుకుంటాడు పూరి.

    'టెంపర్' అదుర్స్... (రివ్యూ)'టెంపర్' అదుర్స్... (రివ్యూ)

    అయితే చాలా మందికి పూరి జగన్నాధ్..బ్యాంకాక్ వెళ్ళే విషయంలోఓ ఒపినియన్ వుంది. పూరి, బ్యాంకాక్ ఎంజాయ్ చేయడానికి వెళుతుంటాడని, అక్కడ థాయ్ అమ్మాయిల మసాజులకు అడిక్ట్ అయ్యడనే టాక్ వుంది. ఇప్పుడీ విషయంపై నేరుగా పూరి స్పదించాడు.

     ఇంటర్వూలో ఓపెన్ గా...

    ఇంటర్వూలో ఓపెన్ గా...

    పూరి జగన్నాథ్ తన కొత్త సినిమా ఇజం (కళ్యాణ్ రామ్ ) ప్రమోషన్ లో బాగంగా ఓ ఛానల్ కి ఇంటర్ వ్యూ ఇచ్చిన పూరి ఈ విషయం ప్రస్తావన రాగా చాలా ఓపెన్ గా రియాక్ట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. పూరి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

     నేను బ్యాంకాక్ వెళ్లేది అందుకే

    నేను బ్యాంకాక్ వెళ్లేది అందుకే

    'జనాలు వాళ్ల ఊహలనే నిజాలు అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు నచ్చుతాయ్. థాయ్ పీపుల్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనలా మనసులో స్వార్ధం కుళ్లు పెట్టుకుని ఉండరు'(తనక్కూడా ఉందని చెప్పాడు లెండి) అందుకే బ్యాంకాక్ వెళ్తా అంటున్నాడు పూరీ.

     ధాయ్ గర్ల్ తో సెక్స్ అనుభవం

    ధాయ్ గర్ల్ తో సెక్స్ అనుభవం


    థాయ్ మసాజులు సినిమాలో చూపించడమే తప్ప. వేరేగా కాదు. నాకు ఏ థాయ్ గాళ్ తోనూ సెక్స్ ఎక్స్ పిరియన్స్ లేదు" అని చాలా ఓపెన్ గా కామెంట్ చేశాడు పూరి. నిజమే నమ్మండి అంటున్నాడు.

     ఎగస్ట్రా సుఖాలు కోసం కాదనటమే

    ఎగస్ట్రా సుఖాలు కోసం కాదనటమే


    పూరి జగన్నాధ్..బ్యాంకాక్ వెళ్లడానికి స్క్రిప్ట్ రాసుకోవడానికి కారణం అనే సంగతి ఓపెన్ సీక్రెట్. అయితే.. చాలా మంది మాత్రం బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేయడానికి వెళుతుంటాడని.. థాయ్ అమ్మాయిలతో మసాజులు గట్రా ఎక్సెట్రా సుఖాల కోసం వెళ్తాడని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఈ మాటలకు పూరీ ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చాడు.

     నిజంగా ధాయ్ గర్ల్ తో చేసి ఉంటే..

    నిజంగా ధాయ్ గర్ల్ తో చేసి ఉంటే..


    థాయ్ మసా.. ఆ మసా అంటూ చూపించడమే తప్ప.. పూరీకి ఇప్పటివరకూ ఎక్స్ పీరియన్స్ లేదన్న మాట. ఏ ఎక్సపీరియన్స్ లేకపోతేనే ఈ రేంజ్ లో మనకు చూపిస్తున్నాడే.. నిజంగా అనుభవిస్తేనో! అని మరికొందరు సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. అయినా రాసేది, చూపేది ప్రతీదీ అనుభవించే చేయాలా. ఎవరో అన్నట్లు హీరో మర్డర్ చేసినట్లు కథ రాస్తే..దాన్ని మనం అనుభవించి రాయక్కర్లేదుగా..

     అందరికి ఆరు నెలలు పడ్తే

    అందరికి ఆరు నెలలు పడ్తే

    నేను ధాయ్ లాండ్, బ్యాంకాక్ బీచ్ లలో కూర్చుని రోజుకు 15 నుంచి 15 గంటలు రాస్తాను. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ తో నేను కేవలం రెండు వారాల్లో స్క్రిప్టు వర్క్ పూర్తి చేయగలను. అదే మిగతా వారు అదే స్క్రిప్టు రాయటానికి ఆరు నెలలు పడుతుంది అని అన్నారు.

     లైన్ అనుకుని ..

    లైన్ అనుకుని ..

    నేను ఏదైనా ఒక లైన్‌ అనుకుంటాను. అనుకున్న వెంటనే బ్యాంకాక్‌ వెళతాను. అక్కడ బీచ్‌లో కూర్చుని కథ రాసుకోవడం అలవాటు నాకు. అక్కడో వన్‌ వీక్‌ ఉంటాను. ఆ వన్‌ వీక్‌లో సీనిక్‌ ఆర్డర్‌ వేస్తాను. అది అయిపోగానే వచ్చేస్తాను. వచ్చి షెడ్యూల్‌ ప్లాన్‌ చేసేయమని నా టీమ్‌ అందరికీ ఇచ్చేస్తాను. వాళ్లు లొకేషన్స్‌, షెడ్యూల్స్‌ అన్నీ ప్లాన్‌ చేసుకునే పనిలో ఉంటారు.

     డైలాగులు అన్నీ వన్ వీక్ లో ..

    డైలాగులు అన్నీ వన్ వీక్ లో ..


    అటు షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతూంటే అప్పుడు మళ్లీ బ్యాంకాక్‌ వెళ్తాను. వెళ్లి ఇంకో వన్‌ వీక్‌ కూర్చుని డైలాగ్స్‌ రాస్తాను. వచ్చేసి షూటింగ్‌ స్టార్ట్‌ చేసేస్తాను. ఇన్ని సినిమాలు చేసాను... అన్నిటికీ జరిగిన ప్రాసెస్‌ ఇంతే... అంతకంటే ఏమీ ఉండదు. రెండు వారాలు కూడా పూర్తిగా ఉండదు. డైలాగ్స్‌ రాయడానికి మాగ్జిమమ్‌ ఫైవ్‌ డేస్‌ తీసుకుంటాను.

     వర్కు ఎక్కువ చేయలేదు

    వర్కు ఎక్కువ చేయలేదు


    ఇప్పటికి నేను ఇరవై ఆరు సినిమాలు చేసాను. ప్రతి సినిమా కథ కోసం నేను పది, పదిహేను రోజుల కంటే ఎక్కువ వర్క్‌ చేయలేదు. ఏ సినిమాకైనా నేను కథ రాసుకునే టైమ్‌ అంతే. ఒకోసారి వర్కవుట్‌ అవుతాయి. ఒక్కోసారి అవ్వవు (నవ్వుతూ).

     లోఫర్ అయినా పోకిరి అయినా

    లోఫర్ అయినా పోకిరి అయినా


    పోకిరి అయినా అంతే లోఫర్ అయినా అంతే.. దేనికైనా అంతే టైమ్‌ తీసుకుంటాను. ఒక్కోసారి ఫుల్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేయలేకపోవచ్చు. ఫోకస్డ్‌గా ఉండకపోవచ్చు. కథ రాస్తున్న ఆ ఏడు రోజుల్లో ఫోకస్డ్‌గా ఉంటే ఒకలా, డిస్టర్బ్‌డ్‌గా ఉంటే ఒకలా ఉంటుంది అవుట్‌పుట్‌. అందువల్లే రిజల్ట్స్‌లో తేడా వస్తుందేమో కానీ దేనికి పని చేసేది అయినా అదే టైమ్‌.

     ఈ సారి ఎంటర్టైనరే కళ్యాణ్ గారితో

    ఈ సారి ఎంటర్టైనరే కళ్యాణ్ గారితో

    కళ్యాణ్‌గారు ఎప్పుడంటే అప్పుడు. ఇంతకుముందు కూడా రెండు సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చింది. అలాగే మళ్లీ ఎప్పుడో ఆయనకి చేద్దామనిపించి పిలుస్తారు. అప్పుడు చేస్తాను. ఈసారి మాత్రం ఆయనతో చేస్తే ఎంటర్‌టైనరే చేస్తాను.

     సోసైటీ గురించి చెయ్యమన్నారు

    సోసైటీ గురించి చెయ్యమన్నారు

    లాస్ట్‌ టైమ్‌ కూడా ఆయనతో కంప్లీట్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ చేద్దామనే వెళ్లాను. గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కలిస్తే సొసైటీ గురించి ఏదైనా సినిమా చేయమని ఆయన నన్ను అడిగారు. ‘ఎందుకు... కమర్షియల్‌ సినిమా చేద్దాం. సొసైటీ గురించి సినిమా అంటే పబ్లిక్‌కి అది నచ్చుద్దో లేదో' అన్నా. ‘లేదు నా ఫాన్స్‌కి నేను ఏదోటి చెప్పాలి. ఫాన్స్‌ నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు' అని అన్నారాయన.

     అందరికీ అభిమానం..

    అందరికీ అభిమానం..


    నా బాల్యం నర్సీపట్నంలో గడిచింది. రోమన్‌ కేథలిక్‌ మిషనరీ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాను. ఆ స్కూలంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఇన్నయ్య అనే ఫాదర్‌ ఉండేవారు. ఆయనంటే మాకందరికీ గౌరవం. ఆయనే కాదు, ఆ స్కూల్లో పనిచేసే ప్రతి మాస్టారన్నా మా కందరికీ ఎంతో గౌరవం, అభిమానం. పేరుపేరునా అందరు మాస్టర్లూ ఇప్పటికీ నాకు గుర్తున్నారు. మా క్లాస్‌మేట్స్‌ ఎప్పుడు కలుసుకున్నా మాట్లాడుకునేది ఆ స్కూలు, అక్కడి మాస్టార్ల గురించే. వాళ్లెప్పుడన్నా కనిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది.

     ఏం నచ్చలేదో చిరు చెప్తే..

    ఏం నచ్చలేదో చిరు చెప్తే..

    చిరంజీవిగారికి కథ చెప్పాను. సగం కథ నచ్చిందని నాతో అన్నారు. రెండో సగం విని మళ్లీ చెబుతా అన్నారు. కానీ ఆ రెండో సగం నచ్చలేదని మీడియాతో అన్నారు. అయితే అందులో ఏం నచ్చలేదో చెబితే కరెక్షన్‌ చేసేవాడిని.

     నేను బ్రతుకుతోంది ఆ బీరువాల వల్లే..

    నేను బ్రతుకుతోంది ఆ బీరువాల వల్లే..

    స్కూలు పుస్తకాలతో పాటు మా నాన్నగారి రకరకాల పుస్తకాలు రెండు బీరువాల నిండా ఉండేవి. అవన్నీ చదువుకునేవాణ్ణి. చలం, రాచకొండ విశ్వనాథశాస్త్రి, శరత్‌చంద్ర, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, షేక్‌స్పియర్‌, రంగనాయకమ్మ.. ఇలా ఎన్నో పుస్తకాలు, రామాయణం, మహాభారతం.. అన్నీ, చందమామ, యువ వంటి పత్రికలు.. ఎనిమిదో తరగతికల్లా చదివేశాను. వాటిలో ఎంత అర్థమైందన్నది వేరే సంగతనుకోండి. అయితే వాటన్నింటినీ చదవడం వల్ల నాకు కలిగిన మేలేమిటంటే.. ఇవాళ నేను బతుకుతోంది ఆ రెండు బీరువాల పుస్తకాల వల్లే అన్నారు పూరి జగన్నాధ్.

     అలాంటివి గుర్తు వస్తే..

    అలాంటివి గుర్తు వస్తే..

    స్కూల్లో ఓసారి ఓ నాటకం వేశాను. దాన్ని చూడ్డానికి మా అమ్మానాన్నలు వచ్చారు. నా నటనకు ఫస్ట్‌ ప్రైజ్‌ ఇచ్చారు. నా స్నేహితుడికి సెకండ్‌ ప్రైజ్‌ వచ్చింది. ఇంటికెళ్లగానే మా అమ్మానాన్నలు ‘‘నువ్వు బాగానే చేశావ్‌. కాకపోతే ఫస్ట్‌ ప్రైజ్‌ నీ ఫ్రెండ్‌కివ్వాల్సింది. వాడు డైలాగ్స్‌ చెబుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అని, మా ఫ్రెండ్‌ని పిలిపించి, నా ఫస్ట్‌ ప్రైజ్‌ వాడికిచ్చి, వాడి సెకండ్‌ ప్రైజ్‌ను నన్ను తీసుకోమన్నారు. అప్పుడు నా స్నేహితుడు కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ‘‘ఏ అమ్మానాన్నలైనా ఇలా చేస్తార్రా. కొడుక్కొచ్చిన ప్రైజ్‌ను పక్కవాడికిస్తారా?'' అన్నాడు. అలాంటివి జ్ఞాపకమొస్తే గుండె తడి అవుతుంటుంది అన్నారు పూరి జగన్నాథ్.

     వర్మ నన్ను హత్తుకుని..

    వర్మ నన్ను హత్తుకుని..

    పవన్‌కల్యాణ్‌తో మొదటి రోజు షూట్‌ ఎలా తీస్తాడో అని అనుకున్నారంతా. ప్యాకప్‌ చెప్పి వచ్చాక.. నా గురువు వర్మ నన్ను హత్తుకుని, నీ లైఫ్‌లో 50 సినిమాలు తీస్తావ్‌ .. పో అని ఆశీర్వదించారు.

     అవన్నీ నా పాత్రల ప్రవర్తనలు

    అవన్నీ నా పాత్రల ప్రవర్తనలు

    నా ప్రతి సినిమాలో హీరోయిన్లకు క్యారెక్టర్లు బావుంటాయి. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న తమిళమ్మాయ్‌ లాంటి సినిమాల్లో హీరోయిన్‌ని బాగా చూపించాను. నా సినిమాల్లో వర్కింగ్‌ ఉమెన్‌నే చూపిస్తాను. మధ్యలో ఏయ్‌, ఒసేయ్‌ లాంటి మాటలు అనడం వల్ల ఆడాళ్లంటే గౌరవం లేదని అనుకుంటారంతే. కానీ అవన్నీ క్యారెక్టర్ల ప్రవర్తనలు అంతే.

     ఆ టైటిల్ తో ఏం నష్టం వచ్చింది

    ఆ టైటిల్ తో ఏం నష్టం వచ్చింది

    పోకిరి వల్ల దేశానికి వచ్చిన నష్టమేంటి? బ్యాడ్‌ ఏం వచ్చింది? పోకిరి టైటిల్‌ బ్యాడ్‌ అనిపించి ఉండొచ్చు. కానీ క్యారెక్టర్‌, కథకి యాప్ట్‌. బిజినెస్‌మేన్‌ టైటిల్‌ అందరికీ నచ్చింది. ఈ సినిమాని ఎంబిఎ కాలేజ్‌లలో విద్యార్థులకు పాఠంగా చెబుతున్నారు.

     మాకు ఏడుపు ఆగలేదు

    మాకు ఏడుపు ఆగలేదు


    ‘‘ నాపేరుతో ‘జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌' అని మాకు ఓ థియేటర్‌ ఉండేది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అమ్మేస్తే ఓ సారి కన్నీరు పెట్టుకుంది. మా గేదెను ఓ సారి సంతలో అమ్మేశాం. ఓ రోజు తెల్లారుజామున ఎవరో తలుపు తడుతున్నట్టు అనిపిస్తే వెళ్ళి చూశాం. ఏడు ఊర్లు దాటుకుని మా ఇంటికి వచ్చేసింది ఆ గేదె. దాన్ని చూసి మాకు ఏడుపు ఆగలేదు. అది కూడా కన్నీరు కార్చింది.

    నమ్మకం నాకు ఉంది అని చెప్పింది

    నమ్మకం నాకు ఉంది అని చెప్పింది

    ఆ మధ్య నేను సర్వం కోల్పోయి నిలబడ్డప్పుడు నన్ను దూషించే ప్రయత్నం చేయలేదు నా తల్లి. తనూ డీలాపడలేదు. ‘నువ్వు మళ్ళీ మొత్తం సంపాదించుకుంటావనే నమ్మకం నాకుందిరా' అని చెప్పి నా భుజం తట్టింది. తన దగ్గరున్న నగలు అమ్మేసి రూ.5 లక్షలు తెచ్చి నా చేతిలో పెట్టింది.''

    English summary
    "I never had sex with a Thai girl", says Puri Jagan, when quizzed about his Bangkok outings, a city that is quite famous for Thai massages and also the liberal sex trade.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X