లవ్, సెక్స్ గురించి ఇంతలా ఎప్పుడూ చూపించలేదు.. సైరాలో క్రేజీ రోల్.. తమన్నా!

Recommended Video

Tamannaah Special Interview About Next Enti Movie | Filmibeat Telugu

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ నెక్స్ట్ ఏంటి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సందీప్ కిషన్, తమన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. తమన్నా గ్లామర్ తో పాటు.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య కలిగే ఫీలింగ్స్ గురించి వివరించే సన్నివేశాల్ని బోల్డ్ గా చూపించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెక్స్ట్ ఏంటి చిత్రం గురించి తమన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్ కూడా బయట పెట్టింది.

 సీరియస్ పాత్రలు

సీరియస్ పాత్రలు

తమన్నా మాట్లాడుతూ నాకు సీరియస్ గా సాగే పాత్రలు చేయాలని ఉండదు. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే పాత్రలు మాత్రమే ఎంచుకుంటాను. నా సినిమాలు చూసి ఆడియన్స్ వినోదాన్ని పొందితే చాలు. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ ఏంటి లాంటి గ్లామర్ పాత్రలు ఎంచుకుంటున్నానని తమన్నా తెలిపింది. నెక్స్ట్ ఏంటి చిత్రం సిటీ ప్రజలకు బాగా చెరువవుతుంది తమన్నా తెలిపింది.

లవ్,సెక్స్ గురించి

లవ్,సెక్స్ గురించి

నెక్స్ట్ ఏంటి చిత్రంలో ప్రేమ, శృంగారం గురించి వ్యక్తుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో చాలా లోతుగా చర్చించారు. ప్రేమ, శృంగారం గురించి ఇంత ఓపెన్ గా చూపించిన చిత్రం ఇంతవరకు తెలుగులో రాలేదని తమన్నా తెలిపింది. గత రెండేళ్లుగా తెలుగు చిత్రాల్లో చాలా మార్పు వచ్చింది. విభిన్న చిత్రాలని తెలుగు ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. బోల్డ్ కంటెంట్ ఉన్నప్పటికీ తమ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని తమన్నా తెలిపింది.

నా వయసుకు సరిపడే పాత్ర

నా వయసుకు సరిపడే పాత్ర

చాలా చిత్రాల్లో నేను నా వయసుకు మించిన పాత్రలు చేశాననే ఫీలింగ్ కలిగింది. కానీ నెక్స్ట్ ఏంటి చిత్రంలో నా వయసుకు సరిపడే పాత్రని పోషించానని తమన్నా తెలిపింది. దర్శకుడు కునాల్ ఈ చిత్రం కోసం తాజాదనం ఉన్న కథని సిద్ధం చేశారు. సన్నివేశాలు సరదాగా కనిపిస్తాయి. కానీ ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక్కో సన్నివేశం చిత్రీకరించడానికి చాలా టేక్స్ అవసరమయ్యానని తమన్నా తెలిపింది.

సైరాలో క్రేజీ రోల్

సైరాలో క్రేజీ రోల్

ఇక తాను నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం గురించి తమన్నా మాట్లాడింది. ఏ చిత్రంలో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నా. చిరంజీవి గారి చిత్రంలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. సైరా, దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రాలు నా కెరీర్ ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తాయని తమన్నా తెలిపింది. బాహుబలిలో నటించిన తరువాత తనకు విభభిన్నమైన చిత్రాల్లో నటించే అవకాశం వస్తోందని తమన్నా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X