»   »  దేశం విడిచి వెళతానని ఎప్పుడూ చెప్పలేదు: అమీర్

దేశం విడిచి వెళతానని ఎప్పుడూ చెప్పలేదు: అమీర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆ మధ్య అసహనం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. భారతలో తీవ్ర అసహన పరిస్థితులు నెలకొన్నాయని, తన భార్య కిరణ్‌ రావు దేశాన్ని విడిచివెళ్దాం అని సలహా ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం పెను దుమారాన్ని సృష్టించింది.

దీనిపై అమీర్ మరోసారి స్పందిస్తూ...భారత్‌లో తీవ్ర అసహన పరిస్థితులు నెలకొన్నాయనో.. లేదంటే దేశం విడిచి వెళ్తాననో తాను ఎప్పుడూ చెప్పలేదని బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. తాను భారతలోనే పుట్టానని, భారతలోనే చస్తానని అన్నారు. మీడియాలోని ఒక వర్గం కారణంగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

మనదేశం మాదిరి విభిన్న భాషలు, సంస్కృతులు, నాగరికతలు ఉన్న దేశం మరొకటి లేదన్నారు. నాకు గానీ.. నా భార్యకు గానీ దేశం విడిచి వెళ్లాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. భారతీయుడనైనందుకు గర్విస్తున్నాను.

Never thought of leaving India, says Aamir Khan

అమీర్ ఖాన్ వ్యాఖ్యల ఎఫెక్ట్....
అమీర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల ఏర్పడిన వివాదం ఎఫెక్టుతో ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించిన సంగతి తెలిసిందే. 'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ఖాన్‌ పనిచేశాడు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ భారత్ బ్రాండ్‌కు నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగటించినట్లు ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్‌ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు, ఆయన్ను తొలగించడం సరైన చర్యే అన్నారు.

మొదట ఆయన తొలగింపుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' అనే అంశానికి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామనీ, ఆ ఏజెన్సీ అమీర్‌తో కాంట్రాక్ట్‌ విషయమై నిర్ణయం తీసుకుని వుండొచ్చని వాదించారు. ఇప్పుడు అధికారికంగా అమీర్‌ఖాన్‌ తొలగింపుపై ఓ అధికారి స్పష్టతనివ్వడం గమనార్హం.

English summary
Actor Aamir Khan on Monday said that he “never thought about leaving the country” and that he was “born in India and will die in India”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu