శ్వేతా బసు కేసులో కొత్తకోణం, రూమ్ బుక్ చేసింది వారే..
హైదరాబాద్: తెలుగు సినీ నటి శ్వేతా బసు ఇటీవల పార్క్ హయత్ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రెస్క్యూ హోంలో ఉంచారు. కాగా తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఈకేసులో పట్టుబడిన హోటల్ గదిని సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్వేతా బసు కూడా తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తూ వస్తోంది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకే తాను ఆ హోటల్ గదిలోకి వెళ్లానని చెబుతోంది. డిఫెన్స్ లాయర్ ప్రదీప్ కుమార్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో హ్యాండిల్ చేస్తున్నారు. మరి శ్వేతా బసు చెబుతున్న దాంట్లో నిజం ఎంత ఉంది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసిన ఆ హోటల్ రూంలోకి ఆమెతో పాటు ఇతర వ్యక్తులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
త్వరలో ఈ కేసులో నిజా నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరో వైపు శ్వేతా బసుపై సినీ వర్గాల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి పలువురు ప్రముఖ దర్శకులు ముందుక వస్తున్నారు.


Click it and Unblock the Notifications











