»   »  రూ. 75కే మల్టీప్లెక్స్ సినిమా

రూ. 75కే మల్టీప్లెక్స్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్ల సంస్కృతి పెరిగిపోతోంది. అయితే ఇక్కడ టికెట్ రేట్స్ అధికంగా రూ.150 ఉండటంతో అంత స్థోమత లేని వారు వాటికి దూరంగానే ఉంటారు. అయితే మల్టీప్లెక్స్ రంగంలోని ‘సినీపోలిస్' సంస్థ మాత్రం రూ.75కే మల్టీప్లెక్స్ టికెట్ అందిస్తామంటోంది.

దక్షిణాదిలో మల్టీప్లెక్స్ థియేటర్లకు అధిక డిమాండ్ ఉందని, హైదరాబాద్ తమకు వృద్ధి అవకాశం ఉన్న ప్రాంతమని సినీపోలిస్ ఇండియా ఎండీ ఏవియర్ సొటొమేయర్ అన్నారు. దేశవ్యాప్తంగా 10వేల మల్టీప్లెక్స్ ల మార్కెట్ ఉండగా ప్రస్తుతం కేవలం 2వేలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ మార్కెట్ అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే రూ. 500 కోట్లు ఖర్చు చేసామని, రాబోయే రెండేళ్లలో మరో 500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు.

 New Cinepolis theatre in Malkajgiri

ప్రస్తుతం ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 206 స్క్రీన్లు ఉన్నాయి. 206వ స్క్రీన్ ను మల్కాజ్ గిరిలోని రామచంద్ర సీసీపీఎల్ మాల్ లో ఏర్పాటు చేసారు. 2017 నాటికి 400 థియేటర్ తెరల సంఖ్యను చేరుకోవాని లక్ష్యంగటా పెట్టుకుంది ఈ సంస్థ. ఈ మేరకు హైదరాబాద్, బెంగుళూరు, కోచి, చండీగడ్, కోల్ కతా, ఢిల్లీ, గౌహతి నగరాల్లో విస్తరణ చర్యలు చేపడుతున్నారు.

English summary
In the next one year, international exhibitor Cinepolis will add another 50 screens in India, out of which 24 will be in the south, said Javier Sotomayor, Managing Director, Cinepolis.
Please Wait while comments are loading...