వివాదాలకు దారి తీస్తున్న అల్లు అర్జున్ కుంతల జలపాతం సందర్శన.. పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఒక్కసారిగా అభిమానులను ఈ న్యూస్ కొంత ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఈ విషయంలో అనేక రకాల కథనాలు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులపై కూడా పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

పుష్ప లొకేషన్స్ కోసం

పుష్ప లొకేషన్స్ కోసం

వివరాల్లోకి వెళితే.. ఇటీవల పుష్ప సినిమా కోసం లొకేషన్స్ ని సందర్శించడానికి అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి తిప్పేశ్వర్‌ ప్రాంతానికి వెళ్లారు. ఇక ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతాన్ని సందర్శించారు. అక్కడ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ కోసం ఫొటోగ్రాఫ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని

అయితే అల్లు అర్జున్‌ తో పాటు పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆరోపించారు. ఇక వారిపై బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

అనుమతులు ఇవ్వకపోయినా..

అనుమతులు ఇవ్వకపోయినా..

అక్కడ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని అనుమతులు లేకుపోయినా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపించారు. కుంతల జలపాతం సందర్శనకు అధికారులు అనుమతులు ఇవ్వలేదని అయినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు కొవిడ్‌ నిబంధనలు లెక్కచేయకుండా ప్రవర్తించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 5 Highlights దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా
అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని..

అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని..

ఇక అల్లు అర్జున్ కి సంబంధించిన ఫొటోలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ వచ్చాడని పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా బన్నీని చూసేందుకు ఎగబడ్డారు. ఇక కోవిడ్ సమయంలో ఈ విధంగా బన్నీ బయటకు వచ్చి అనవసరంగా రూల్స్ ని బ్రేక్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X