twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయప్రద ముఖ్య పాత్రగా హారర్ చిత్రం ప్రారంభం

    By Pratap
    |

    హైదరాబాద్: పాప్ కార్న్ స్పోర్ట్స్ ఎంటర్ టైనెంట్స్, వి.ఎన్.వి ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీరజ్ వాలా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారంనాడు చీర్యాల లోని నరసింహస్వామి గుడి ప్రాంగణంలో జరిగింది.

    ఈ సందర్భంగా నటిమణి జయప్రద మాట్లాడారు. "చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. డబ్బు మాలిక్, నీరజ్ వాలా, అర్మాన్ మల్లిక్ వంటి బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయనుండడం సంతోషకరం" ఆమె అన్నారు.

    Jayaprada

    "గతంలో సంగీతం విభాగంలో పలు ఫిలిం ఫేర్ అవార్డులతోపాటు, అసంఖ్యాక అభినందనలు అందుకొన్న అర్మాన్ మల్లిక్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించనుండడం విశేషం. ఈ చిత్ర నిర్మాత బాలగిరి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు, మంచి మిత్రులు. నేడు ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాతో నటింపజేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

    "చీర్యాల చైర్మెన్ నర్సింహ్ గారు ఇక్కడకు విచ్చేసి మా చిత్ర బృందాన్ని అభినందించడం సంతోషంగా ఉంది. కామెడీకి ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ వాలా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనుండడం చాలా సంతోషంగా ఉంది" అని జయప్రద అన్నారు.

    గాయకుడు అర్మాన్ మల్లిక్ మాట్లాడుతూ... "అద్భుతమైన ప్రతిభావంతులందరూ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. మా నాన్నగారు డబ్బు మాలిక్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి మా అన్నయ్య ఆమాల్ మాలిక్ సంగీతం సమకూర్చుతున్నారు" అన్నారు.

    దర్శకుడు నీరజ్ వాలా మాట్లాడుతూ... "సీనియర్ నటీమణి జయప్రదగారు ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందిస్తుండడం ఆనందంగా ఉంది. నర్సింహ స్వామి ఆశీస్సులు లభించి మా ఈ ప్రయత్నం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

    English summary
    A trilingual movie Jayaprada has begun today at Cheryala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X