twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహాత్మాగాంధీ హత్య కుట్రపై సినిమా

    By Srikanya
    |

    కోల్‌కతా: మహాత్మాగాంధీని హత్యచేసేందుకు నాథూరాం గాడ్సే...అతడి భాగస్వాములు పన్నిన కుట్ర ఇతివృత్తంగా త్వరలోనే ఒక సినిమా తెరకెక్కనుంది. మనోహర్‌ మల్గోంకర్‌ రచించిన ' ద మెన్‌ హూ కిల్డ్‌ గాంధీ' పుస్తకం ఆధారంగా నిర్మించే సినిమాకు సిద్దార్థసేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తారు.

    ఈ పుస్తకాన్ని ప్రచురించిన రోలీబుక్స్‌ ఈ విషయాన్ని సోమవారం ఇక్కడ ప్రకటించింది. 2014 జనవరిలో ఈ సినిమా విడుదలౌతుంది. మహాత్మాగాంధీ 66వ వర్థంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. మహాత్మాగాంధీ హత్య జరిగిన ప్రదేశమైన ఢిల్లీలోని బిర్లాహౌస్‌కు మూడో ఇంట్లోనే రచయిత మల్గోంకర్‌ అప్పట్లో ఉండేవారు.

    ఇక గతంలో రాజీవ్ గాంధీ ,ఇందిరా గాంధీ వంటి ప్రముఖుల హత్యల వెనక ఉన్న కుట్రలపై చిత్రాలు వచ్చాయి. ఇంకా తీయటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దగ్గర..ఏక్ హసీనా ధీ, మిస్టర్ యా మిసెస్, నిశ్శబ్ద్ చిత్రాలకు అశోసియేట్ గా పనిచేసిన సురిందర్‌ హివరలే త్వరలో దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య నేపథ్యంతో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు ప్రారంభించారు.

    ప్రముఖ పాత్రికేయుడు రాజీవ్‌ శర్మ రాసిన ఓ పుస్తకం ఆధారంగా చిత్ర కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై సురిందర్‌ హివరలే మాట్లాడుతూ...నేను గత తొమ్మిది నెలలుగా ఈ స్క్రిప్టు పనులోనే బిజీగా ఉన్నాను. పూర్తి సంతృప్తిగా స్క్రిప్టు వచ్చాకే షూటింగ్ కి వెళ్ళాలనుకున్నాను. ఆ దశ వచ్చింది. వర్మ శిష్యుడిగా నేను ఎప్పుడూ గర్వపడుతూంటాను. ఆయన గతంలో తీసిన కల్ట్ ఫిలింల తరహాలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. షూటింగ్ లో ఎక్కువ భాగం శ్రీలంక, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో జరుపుతాం. కథలో కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటలీలోనూ తెరకెక్కిస్తాను అన్నారు.

    English summary
    
 Chronicling the sinister plot by Nathuram Godse and his partners to kill the 'Mahatma', Manohar Malgonkar's book 'The Men Who Killed Gandhi' would soon be made into a film. Roli Books, the publishers of the book, announced that Cinetek Films have bought the rights for the motion picture to be directed by Siddharth Sengupta. The film is scheduled for release in January 2014 to mark the 66th death anniversary of Mahatma Gandhi, they said in a statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X