twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాబాల బాగోతం'తేలుస్తానంటున్న సీనియర్ దర్సకుడు

    By Srikanya
    |

    డా.శివప్రసాద్‌ ప్రధాన పాత్రలో ..దొంగ బాబాల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'బాబాల బాగోతం'. సీనియర్‌ దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో ఎస్‌.దేవదానం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌ లో మొదలైంది.ఈ సందర్భంగా దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ-"నేటి సమాజంలో ఈజీ మనీ సంపాదించడం చాలామందికి అలవాటైపోయింది. ఇందులో భాగంగా దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. దీనికి కారణం ప్రజలే. ప్రజల్లో చైతన్యం రావాలి. స్వశక్తిని నమ్మే గుణం వారికి రావాలి. ఈ చిత్రం ద్వారా మేం చెప్పే సూక్తి కొందరినైనా ప్రభావితం చేస్తే మా ప్రయత్నం సఫలం అయినట్టే' అంటున్నారు.

    ఇందులో తను ఓ దొంగబాబాగా చేస్తున్నానని, నటనకు అవకాశం ఉన్న పాత్ర తనకు లభించిందని శివప్రసాద్‌ చెప్పారు. ఈ చిత్రంలో భరత్‌బాబు, షఫాలీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకుల సంఘం అధ్యక్షడు సాగర్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, రిటైర్డ్‌ ఐజీ గోపీనాథ్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని అతిథులు ఆకాంక్షించారు. అశోక్‌కుమార్‌, సత్యప్రకాష్‌, రామిరెడ్డి, కొండవలస, చిట్టిబాబు, రఘునాథరెడ్డి, హేమసుందర్‌, కిన్నెర, రమ్యశ్రీ, సత్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: దేవశ్రీ ప్రొడక్షన్స్‌, మాటలు: ఎ.విజయకుమార్‌, కెమెరా: కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం: డా.శ్రీకాంత్‌, నిర్మాణం: దేవశ్రీ ప్రొడక్షన్స్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X