'దోమ (గుడ్‌ఫ్రెండ్)' టైప్ ఛాంబర్‌లో నమోదైన కొత్త టైటిల్స్
హైదరాబాద్ : ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఈ నెలలో రిజిస్టిరైన ఫిలిం టైటిల్స్ కొన్ని....
మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్: 'భీష్మ'.
దేవా ప్రొడక్షన్స్: దోమ (గుడ్‌ఫ్రెండ్),
సిరి వెంకటేశ్వర ఫిలింస్: ఫుల్ మాస్..100%లవ్,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'జనగణమన',
శ్రీ ఆదిత్య ప్రొడక్షన్స్: కౌటిల్యుడు,
శ్రీసునంద పిక్చర్స్: మిస్ తార రొమాంటిక్ స్టోరీ,
ఎస్‌వికె సినిమా: ప్రేమా గీమా జాన్‌తానై, (ఐ హేట్ లవ్),
చిత్రం మూవీస్: రైతు (ద వారియర్),
సన్‌నేషనల్ మూవీస్: రాజకోట రహస్యం,
శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్: శ్రీశ్రీ,
ఎఎఆర్ట్స్: విక్రమ్ రాథోడ్ (ది ఫర్‌ఫెక్ట్ పోలీస్).
సురేష్‌ప్రొడక్షన్స్: మజ్ఞు,
ఆస్కార్ ఫిలిం ప్రై.లిమిటెడ్:మనోహరుడు,
ట్వంటీఫోర్త్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రై.లిమిటెడ్: రావణ,
సాయిగణేష్ ప్రొడక్షన్స్ లిమిటెడ్: గంగ.
ఈ చిత్రాల్లో కొన్ని సినిమాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే దిల్ రాజు నమోదు చేసిన జనగణమన టైటిల్ పై ఇప్పటికే మీడియాలో రచ్చ జరిగింది. జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి 'జగగణమన' అనే టైటిల్ పెడుతున్నట్లు వస్తున్న వార్తలను....దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఫిల్మ్ చాంబర్లో 'జనగణమన' అనే టైటల్ రిజిస్టర్ చేయించారు. దీంతో ఆ టైటిల్ జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ చిత్రం కోసమే అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా తేలిన విషయం ఏమిటంటే ఇటీవలే ఆగస్టు 15 నేపథ్యంలో దిల్ రాజు మనసులో 'జనగణమన' అనే టైటిల్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం దాన్ని రిజిస్టర్ చేయించారు. ఏదైనా దేశ భక్తి సంబంధమైన సినిమాకు దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడట.


Click it and Unblock the Notifications











