పవన్ కళ్యాణ్-గూగుల్...ఎల్లకాలం గుర్తుండి పోతోంది!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ జీవితంలో ఎన్నో బర్త్ డేలు వస్తుంటాయి...పోతుంటాయి. కానీ ఆయన 44వ పుట్టినరోజు(నేడు) మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అందుకు కారణం ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థనే. గూగుల్ సంస్థకు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు అసలు సంబంధం లేకపోయినా, పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ... కాకతాళీయంగా జరిగిన ఓ సంఘటన ఈ పుట్టినరోజుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ రోజు గూగుల్ సంస్థ తన కంపెనీ లోగోలో మార్పులు చేసింది. సెప్టెంబర్ 2 నుండి గూగుల్ కొత్త లోగో దర్శనమిస్తోంది. ఇదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో....... గూగుల్ తన లోగో మార్చిన రోజు ఏదంటే పవన్ కళ్యాణ్ 44వ పుట్టినరోజు నాడు అని ఇట్టే గుర్తు పెట్టుకునేలా ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు.

త్త లోగోలో నీలం, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులున్నాయి. లోగోను సింపుల్ గా, కలర్ ఫుల్ గా చూపాలన్న భావనతో పాటు, భవిష్యత్ లో మారే విధానానికి గుర్తుగా చూపాలన్న ఉద్దేశంతో కొత్త లోగోను డిజైన్ చేశామని సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం గూగుల్ ఆదాయం సాలీనా 60 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 వేల కోట్లు) దాటింది.


Click it and Unblock the Notifications