twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కుటుంబం నుంచి మరో కొత్త హీరో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి కుటుంబం నుంచి మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి వారసులుగా వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి వారు హీరోలుగా వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. మరో వైపు చిరంజీవి బావమరిది అరవింద్ కొడుకు అల్లు శిరీష్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్......గౌరవం, రేయ్ చిత్రాలతో ఈ సంవత్సరం హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

    తాజాగా మెగా కుటుంబం నుంచి మరో కొత్త హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పేరు వెంకట్ రాహుల్. చిరంజీవికి మేనల్లుడి వరుస. వెంకట్ రాహుల్ హీరోగా 'అలియాస్ జానకి' అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో పంజా చిత్రాన్ని తెరకెక్కించిన నీలిమ తిరుమల శెట్టి శ్రీసంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనీష అనే కొత్త అమ్మాయి హీరోయిన్‍‌గా చేస్తోంది. ఈ చిత్రం ద్వారా దయా అనే దర్శకుడు తెర్రంగేటం చేస్తున్నాడు.

    గతంలో 'అలియాస్ జానకి' చిత్రాన్ని కొత్త వారితో తీస్తున్నట్లు, నిషా అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు, పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ సేన్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు నిర్మాత నీలిమ తిరుమల శెట్టి ప్రకటించారు. అయితే ఏమైందో ఏమోగానీ.....అందరినీ మార్చేసి మళ్లీ ఈ చిత్రాన్ని కొత్తగా మెగా మేనల్లుడితో ప్రారంభించారు.

    ఆ సంగతి పక్కన పెడితే....నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం అతనికి సరిపోయే కథల కోసం అన్వేషణ సాగుతోంది. వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు.

    English summary
    Another star is being introduced from Mega Camp. This new hero is Chiru’s another nephew Venkat Rahul. Rahul’s launch movie ‘Alias Janaki’. This movie Produced by Neelima Tirumalsetty, Directed by Dayaa.k.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X