twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున మూవీలో న్యూ హీరోయిన్: హాట్‌ ఫోటోస్ షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ!

    By Bojja Kumar
    |

    Recommended Video

    నాగ్ మూవీలో న్యూ హీరోయిన్.. హాట్‌ ఫోటోస్ షేర్ చేసిన వర్మ!

    నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోమయానికి తెరదించుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ గా చేస్తున్న అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

    నాగార్జునతో తాను చేయబోయే సినిమాలో కొత్త అమ్మాయి నటిస్తోందని, ఆమె పేరు మైరా సరీన్ అని వర్మ తెలిపారు. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలు వర్మ విడుదల చేశారు.

    ఈవిడే ఆ కొత్త అమ్మాయి

    ఈవిడే ఆ కొత్త అమ్మాయి

    "నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివే" అంటూ వర్మ ఎఫ్‌బిలో పోస్టు చేశారు.

    ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ఉండవా?

    ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ఉండవా?

    ఈ సినిమాలో నాగార్జునకు, మైరా సరీన్‌కు మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్లు ఉండవని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న కథ పరంగా ఇందులో అలాంటి సీన్ల అవసరం ఉండదని టాక్. నాగార్జునతో పాటు ఆమె కూడా యాక్షన్ సీన్లలో నటించనుందని తెలుస్తోంది.

    పోలీస్ ఆఫీసర్ పాత్ర

    పోలీస్ ఆఫీసర్ పాత్ర

    తన తాజా సినిమాలో నాగార్జునను డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నాడు వర్మ. ఇందుకోసం నాగ్‌ను కాస్త కండలు పెంచాలని సూచించాడట. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

    అంచనాలు భారీగా

    అంచనాలు భారీగా

    ‘శివ' సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున-వర్మ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వర్మకు ఈ మధ్య చెప్పుకోదగ్గ హిట్స్ లేక పోయినా ఆయన టాలెంటు మీద నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాడట నాగార్జున.

    వర్మ టాలెంట్ అదే

    వర్మ టాలెంట్ అదే

    కొన్ని చెత్త సినిమాలు తీసినప్పటికీ ఇండియన్ సినిమా పరిశ్రమలోని గ్రేట్ డైరెక్టర్లలో వర్మ ఒకరు. ఆయన తన సినిమాలో క్యారెక్టర్లు డిజైన్ చేసే తీరు చాలా బావుంటుంది. ముఖ్యంగా తనకు కావాల్సిన విధంగా సినిమాలోని పాత్ర లుక్స్ విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌నెస్ ఉండేలా వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

    English summary
    Ram Gopal Varma today declared that he had selected a new heroine for Nagarjuna film. He posted her pics and name. The new heroine name is Myra Sarin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X