ఎన్టీఆర్ సలహాపై దిల్ రాజు..
వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందనున్న బృందావనం చిత్రం కోసం హీరోయిన్ సెర్చింగ్ జరుగుతోంది. ఇందుకోసం కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. పెద్ద హీరోయిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేయటం కన్నా ఈ పద్దతే బెటరని ఎన్టీఆర్ సలహా ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి ధమస్ సంగీతం అందిస్తున్నారు. ధమస్ లేటెస్ట్ గా జయీభవ చిత్రానికి పనిచేసారు. అంతకుముందు ఆంజనేయులు,కిక్ చిత్రాలకు అతను సంగీతం అందించారు. అలాగే మున్నా చిత్రంతో టెక్నికల్ గా తానేమిటో నిరూపుంచుకున్న వంశి ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రం టైటిల్ కు గోవిందుడు అందరి వాడేలే అనే ట్యాగ్ లైన్ ఉంది.
జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం వంశి పైడిపల్లి రొమాంటిక్ కామిడీ జయీభవ ధమస్ కిక్ ఆంజనేయులు jr ntr brindavanam vamsi paidipalli dil raju thamas


Click it and Unblock the Notifications