కొత్త ఒక వింత పాత ఒక రోత

By Sindhu

కొత్తనీరొచ్చి పాతనీరు పోయినట్టుగ కొత్త హీరోయిన్లు వచ్చి పాత హీరోయిన్లు ఇతర భాషలకు సంబందిచిన ఇండస్ట్రీలో కాలు మోపడం, నిర్మాతలు గా మారడం, పెళ్ళిల్లు చేసుకోవడం వంటివి చిత్ర పరిశ్రమలో సహజాతిసహజం. అసిన్, త్రిష, నయనతార, ఇలియానా, కాజల్‌, తమన్నా తదితరుల రాకతో, అప్పటివరకూ అగ్ర కథానాయికలుగా అలరించినవారు పెళ్ళిళ్లు చేసుకోవడమో, లేక ఇతర భాషలకు తరలిపోవడమో జరగడం మనకు తెలిసిందే. అదేవిధంగా, ఇప్పుడు టాప్ లిస్ట్ లో తిరుగులేని కథానాయికలుగా చెలామనిఅవుతున్న ఇలియానా, కాజల్‌, అనుష్క, తదితర టాలీవుడ్ తారామణులకు చెక్‌ చెప్పేందుకు మరికొందరు కొత్తమ్మాయిలు తెలుగులో తెరంగేట్రం చేస్తున్నారు.

ప్రభాస్‌-పూరీ జగన్నాధ్‌ల 'ఏక నిరంజన్‌"తో కంగనా రనౌత్‌ తెలుగు తెరంగేట్రం చేస్తున్నది. నాగార్జునతో శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఇంకా టైటిల్ ఖరారు చేయని చిత్రం ద్వారా 'చిత్రాంగద" అనే బాలీవుడ్‌ బ్యూటీ పరిచయమవుతుండగా, నాగార్జున తనయుడు నాగచైతన్య ద్వితీయ చిత్రంలో తమిల నటి 'సమంతా" అనే సుందరి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ఇకపోతే కొత్త హీరోయిన్లను పరిచయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే 'పవన్‌ కళ్యాణ్‌" తన తాజా చిత్రం 'కొమరం పులి"తో నికిషా పటేల్‌తో తెలుగు తెరంగేట్రం చేయిస్తున్నారు.అమీషా పటేల్‌, రేణుదేశాయ్‌, కీర్తిరెడ్డి తదితరులు పవన్‌కళ్యాణ్‌ చిత్రాల ద్వారా పరిచయమైనవారేనన్న విషయం తెలిసిందే. అలాగే, డాడి.రామానాయుడు మనవడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న 'లీడర్‌" చిత్రం ద్వారా 'ప్రియా ఆనంద్‌" వెండి తెరపై తళుక్కుమననుంది. గీతాకృష్ణ స్వీయనిర్మాణంలో రూపొందిస్తున్న 'కాఫీబార్‌" చిత్రం ద్వారా బియాంకదేశాయ్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నది. మరి వీరిలో ఎవరు తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎవరు కొల్లగొట్టగలుగుతారో వేచి చూడాలి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X