జగపతిబాబు, మాస్టర్ అతులిత్ కాంబినేషన్లో వస్తున్న మా నాన్న చిరంజీవి చిత్రం రిలీజుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లాన్ చేసారు. ఈ చిత్రం ఆడియో సీడీలు, ట్రైలర్స్ ని స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే్ ఈ సినిమా హాలీవుడ్ చిత్రం పరిష్యూట్ ఆఫ్ హ్యాపీడేస్ (2006)ఆధారంగా నిర్మితమవుతోంది. నీలిమ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇక అరుణ్ ప్రసాద్ గతంలో పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రం తీసారు. అనంతరం నవదీప్ తో గౌతమ్..ఎస్.ఎస్.సి తీసారు. ఆ తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో స్వర్గీయ వైయస్ రాజశేఖకర్ రెడ్డిని నటింప చేస్తూ గోకరాజు తీసారు. కానీ అది విడుదల కాలేదు. అంతేగాక నవదీప్ హీరోగా భూమిక ప్రధాన పాత్రలో యాగం చిత్రం తీసారు. అదీ రిలీజ్ కాలేదు.