న్యూ లుక్ అదిరింది: అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’

By Bojja Kumar

హైదరాబాద్: అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిపాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి'. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ పై విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపధ్యంలో ‘రుద్రమదేవి' చిత్రానికి సంబందించిన గోనగన్నారెడ్డి న్యూ లుక్ విడుదల చేసారు. వారియర్ గోటప్‌లో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. వీడియో...సక్రాంతి రోజు(రేపు) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అల్లు అర్జున్ అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీలో తెలిపారు.

గుణ శేఖర్ మాట్లాడుతూ... ''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

 New Look: Allu Arjun as Gona Ganna Reddy

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది.'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X