సరికొత్త ఇమేజ్ లో స్నేహ!

By Sindhu

రాధా గోపాళం చిత్రంలో అచ్చు బాపు బొమ్మలా కనిపించి, శ్రీరామదాసు చిత్రంలో నాగార్జున సరసన భక్త రామదాసు భార్యగా నటించి, పాండురంగడు లాంటి చిత్రాలు లో తనదైన శైలిలో నటిచే స్నేహా మన పక్కింటమ్మాయిలా సాంప్రదాయబద్ధంగా ఉండే హీరోయిన్ స్నేహ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కుటుంబకథా చిత్రా కథానాయికగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు భిన్నమైన యాక్షన్ హీరోయిన్ ఇమేజ్ కోసం కసరత్తులు ప్రారంబించారు నటి స్నేహ.

ఈ క్రమంలోనే గతంలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించిన 'కర్తవ్యం" ని ఆధారం చేసుకుని రూపొందుతున్న 'భవానీ ఐపీయస్" ని అంగీకరించారమె. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. స్నేహ పోలీసాఫీసరా? అని నొసలు చిట్లించినవారిని సైతం ఆశ్చర్యపరుస్తూ ఆమె తగిన వ్యాయామాలు చేసి సన్నబడ్డారు. చీరకట్టులో మురిపించిన స్నేహ పోలీస్ డ్రెస్ లో అందుకు తగ్గట్టుగానే చక్కగా ఉన్నారు. ఇప్పటి వరకు హీరోల సరసన ముద్దబంతి పువ్వులా అలరించిన ఆమె ఈ చిత్రంలో హీరోలకు ఏ మాత్రం తగ్గని విధంగా పోరాటాలు కూడా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇది కాకుండా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న 'గోవా" చిత్రంలో స్నేహ నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. మొత్తానికి ప్రస్తుతం చేస్తున్న స్నేహ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా స్నేహకి దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X