బాలకృష్ణ బర్త్ డేకి కొత్త సినిమా ప్రారంభం...!
బాపు దర్శకత్వంలో భక్తిరసాత్మక చిత్రం శ్రీరామరాజ్యంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న బాలకృష్ణ ఈ రెండు సినిమాలపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు ఈ సంత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. అయితే రెండు సినిమాల రిలీజ్ లో చాలా గ్యాప్ తీసుకోవాలని మాత్రం అనుకుంటున్నాడట.
ఓ పక్క ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతుండగానే మరో కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. జూన్ 10 బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆరోజు బాలకృష్ణ హరోగా మరో భారీ చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఆ సినిమాకి నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచారు. బాలకృష్ణను ఓ కొత్తకోణంలో చూపించే సినిమా అని మాత్రం తెలుస్తోంది. వెయిట్ అండ్ సీ...
balakrishna sri rama rajyam bapu paruchuri murali nayantara బాలకృష్ణ శ్రీరామ రాజ్యం బాపు పరుచూరి మురళి నయనతార


Click it and Unblock the Notifications