»   » తొలి బర్త్ డే: ఆనందంలో తేలిపోతున్న జెనీలియా (ఫోటోస్)

తొలి బర్త్ డే: ఆనందంలో తేలిపోతున్న జెనీలియా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రియాన్.... జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ముద్దుల కుమారుడు. ఈ బుడతడు ఇంకా బాలీవుడ్లో అడుగు పెట్టక పోయినా బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. బాలీవుడ్ సర్కిల్ లో షారుక్ ఖాన్ కొడుకు అబ్ రామ్ తర్వాత, ఆ రేంజిలో సెలబ్రిటీ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్.

నవంబర్ 25, 2014న జన్మించిన రియాన్ నేడు తన తొలి పుట్టనరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్, ఆకట్టుకునే క్యాప్షన్లతో పోస్టు చేసింది జెనీలియా. తొలి పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

‘హ్యాపీ బర్త్ డే రియాన్...ఐయామ్ యువర మామ్ అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్...యూ ఆర్ మై లైఫ్...మే గాండ్ బ్లెస్ యూ ఆల్వేస్' అంటూ జెనీలియా తన ట్విట్టర్లో పేర్కొంది. మరో ఫోటోకు...‘థాంక్యూ రియాన్ ఫర్ మేకింగ్ మి ఎ మామ్...థాంక్ యు మై బేబీ ఫర్ మేకింగ్ అవర్ లైవ్స్ స్పెషల్....హ్యాపీ బర్త్ డే మై బేబీ' అంటూ క్యాప్షన్స్ పెట్టింది.

తమ ముద్దుల కుమారుడికి ‘రియాన్' అనే పేరు పెట్టడంపై పలువురు ఆశ్చర్య పోయారు. వాస్తవానికి ఆ పేరు అనుకున్నపుడు దాని మీనింగ్ కూడా రితేష్, జెనీలియా దంపతులకు తెలియదు. కొడుకు పేర్లు పెట్టేందుకు వెతుకుతుంటే ఆన్ లైన్లో ‘రియాన్' అనే పేరు కనిపించిందట. తర్వాత దాని మీనింగ్ కోసం ప్రయత్నిస్తే... ‘రియాన్' అనే లిటిల్ కింగ్, రూలర్ అనే మీనింగ్ వస్తుందని తెలిసిందట. సంస్కృతంలో కూడా ఈ పేరు ఉండటంతో తమ కొడుక్కి అదే పేరు ఖాయం చేసారు.

రియాన్

రియాన్


నవంబర్ 25, 2014న జన్మించిన రియాన్ నేడు తన తొలి పుట్టనరోజు వేడుక జరుపుకుంటున్నాడు.

జెనీలియా-రియాన్

జెనీలియా-రియాన్


తల్లితో కలిసి ఆడుకుంటున్న రియాన్. ఎంతో క్యూట్ గా ఉన్నాడు కదూ..

దివాళి..

దివాళి..


ఇటీవల జరిగిన దివాళి సెలబ్రేషన్స్ లో తండ్రితో కలిసి రియాన్.

గ్రాండ్ మదర్

గ్రాండ్ మదర్


గ్రాండ్ మదర్ తో కలిసి రియాన్.

సో స్వీట్

సో స్వీట్


తల్లి జెనీలియా, నాయనమ్మ వైశాలి దేశ్ ముఖ్ తో కలిసి బుడి బుడి అడుగులు వేస్తున్న రియాన్.

పిక్చర్ పర్ ఫెక్ట్

పిక్చర్ పర్ ఫెక్ట్


కొడుకుతో కలిసి జెనీలియా, రితేష్ దంపతుల ఫ్యామిలీ పిక్

English summary
Riteish Deshmukh and Genelia D'Souza's son Riaan is surely one of the most cutest babies of Bollywood and definitely a star in the making. Riaan was born on November 25th, 2014 and today the little munchkin is celebrating his first birthday. Few moments back, mommy Genelia took to her micro blogging site and wished Riaan, with some beautiful pictures and captions.
Please Wait while comments are loading...