ఉదయ్ కిరణ్ గురించి...మరో పాయింట్ వెలుగులోకి!

By Bojja Kumar

Uday Kiran
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అంశాన్ని తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు అంత త్వరగా జీర్ణించుకోలేక పోతున్నారు. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత రోజుకొక వాస్తవం వెలుగులోకి వస్తుండటం చర్చనీయాంశం అయింది. అసలు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణమేంటి? అనే సంగతి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఉదయ్ కిరణ్‌కు సంబంధించిన మరో పాయింట్ వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కిరణ్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చిందని, ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో నటించే అవకాశం వచ్చిందని, దాదాపుగా ఈ సినిమాకు సైన్ చేసే వరకు ఉదయ్ కిరణ్ వెళ్లారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఖరారయ్యేలోపే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సో....దీన్ని బట్టి ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు అవకాశాల లేమి ప్రధాన కారణం కాదని స్పష్టమవుతోంది.

మరో వైపు ఫిల్మ్ నగర్లో కూడా....ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు లేవనే వాదనను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు కూడా కావని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఇంకేదో బలమైన కారణం ఉంటుందని, బహుషా అవి బయటి ప్రపంచానికి తెలియని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయని భావిస్తున్నారు.

ఉదయ్ కిరణ్ మరణం వెనక కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అటు సినిమా సర్కిల్ లో ఆరా తీయడంతో పాటు, అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా అందరి నుండి సమాచారం రాబడుతున్నారు. త్వరలోనే ఉదయ్ కిరణ్ మృతి వెనకగల అసలు వాస్తవం వెలుగులోకి వచ్చే అవకావం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X