సర్‌ప్రైజ్.. సాహూ నుంచి మరో లుక్.. ప్రభాస్ ఆన్ ఫైర్
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ ప్రాజెక్టు సాహూ. ఈ చిత్రానికి సంబంధించి ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహూ రూపంలో పలు వీడియోలతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగానే ప్రభాస్ కూడా రంగంలోకి దిగి తన కొత్త సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సాహూ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో సాహూ అప్‌డేట్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. తమ అభిమాన హీరోకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఈ లోగా చడీ చప్పుడు లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ తాజాగా సాహూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బైక్ పై హై రేంజ్ స్పీడ్ లో దూసుకుపోతూ ప్రభాస్ ఆన్ ఫైర్ అన్నట్లుగా ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. అలా విడుదలైందో లేదో ఇలా వైరల్ అయింది ఈ లేటెస్ట్ పోస్టర్. ఇక దీనిపై లైకులు, కామెంట్లకైతే కొదవే లేదు. ఆగస్టు 15 వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్.

ఒళ్ళు గగ్గుర్లు పొడిచే భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటోంది సాహో మూవీ. మునుపెన్నడూ చూడని విధంగా కానీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం. కార్ చేజింగ్స్, ఫైట్స్ థియేటర్లు హోరెత్తడం ఖాయం అని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











