సాహో కొత్త పోస్టర్.. కేక పెట్టించేలా ప్రభాస్ లుక్.. బర్త్ డే కానుక ఏంటంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ సాహో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవల రాధాకృష్ణ దర్శత్వంలో కూడా ప్రభాస్ ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. సాహో చిత్రం 2019 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తరువాత సాహో చిత్ర యూనిట్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

కొత్త పోస్టర్
తాజాగా సాహో చిత్రానికి సంబందించిన కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ లుక్ పూర్తిగా కనిపించకుండా ముఖాన్ని నీడలో దాచేశారు. చాలా కాలం తరువాత చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ రావడంతో చిత్ర యూనిట్ పండగ చేసుకుంటున్నారు.
పుట్టినరోజు కానుక
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రభాస్ బర్త్ డే కానుకగా సాహో చాప్టర్ 1 పేరుతో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. 23 ఉదయం 11 గంటలకు సాహో చిత్రానికి సంబందించిన సర్ ప్రైజ్ విడుదల కానుంది.

శ్రద్దా కపూర్ హీరోయిన్
సాహో చిత్రంలో బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిర బేడీ, నీల్ నితిన్ ముఖేష్ వంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నాడు.

ప్రేమ కథతో ప్రయోగం
ఇదిలా ఉండగా ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1960 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ కథగా రూపొందుతోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











