అనుష్క హాట్ లుక్: ‘సైజ్ జీరో’కొత్త పోస్టర్

By Bojja Kumar

హైదరాబాద్: ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అనుష్కను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకయ్యారు. తమ కలల దేవతనను తెరపై ఇలా చూస్తామని వారు బహుషా ఊహించి ఉండరు. అయితే తాజాగా విడుదలైన మూడో పోస్టర్లో అనుష్క లుక్ సెక్సీగా, హాట్ గా ఉండటంతో అభిమానుల మనసు కుదట పడింది. ఆ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Size Zero

డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న, వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పెర్కొంది.

ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్ప్రక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X