నితిన్ కల్యాణానికి కొత్త ముహూర్తం కుదిరింది!
నితిన్ నటిస్తున్న తాజగా చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. సాంప్రదాయ వివాహబంధ విలువని తెలియజెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నితిన్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 2003 లో వచ్చిన దిల్ చిత్రం తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మొదట ఈ చిత్రాన్ని జులై లో విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. తాజగా ఈ చిత్ర విడుదలకు ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 9 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ గత రెండు చిత్రాలు లై, ఛల్ మోహన్ రంగ నిరాశ పరచడంతో ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.


Click it and Unblock the Notifications











