మహేశ్ ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్.. అదిరిపోయే ప్రకటన చేయనున్న సరిలేరు టీమ్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్న మహేశ్.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస విజయాలతో దూకుడును ప్రదర్శిస్తున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే....

ఆయనతో కలిశాడు.. హ్యాట్రిక్ కొట్టేశాడు
మహేశ్ బాబు ఈ మధ్య రెండు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేశాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా హిట్ అవడంతో మహేశ్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదైంది.

పోటీని తట్టుకుని నిలబడ్డ మహేశ్
సంక్రాంతికి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్'తో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' చిత్రాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ పోటీని తట్టుకున్న మహేశ్ బాబు సినిమా.. భారీ విజయాన్ని అందుకుంది. మొదటిరోజే మంచి టాక్ సంపాదించడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేశాడు సూపర్ స్టార్.

మైలురాయిని దాటేసిన సరిలేరు
మెగా హీరో సినిమాతో పోటీ ఉన్నప్పటికీ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, బెంగళూర్, చెన్నైలలో ఇప్పటి వరకు రూ. 125 కోట్లు పైచిలుకు షేర్ రాబట్టింది. అదే సమయంలో రూ. 200 కోట్లు ప్లస్ గ్రాస్ సంపాదించింది. దీంతో మహేశ్ బాబు ఖాతాలో పలు రికార్డులు కూడా వచ్చి చేరాయి.

మహేశ్ ఫ్యాన్స్‌కు అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్
బుధవారం ఈ సినిమా యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమాలో 90 సెకెన్ల నిడివి ఉన్న ఓ కామెడీ సీన్‌ను కలపబోతున్నారనేదే దాని సారాంశం. సినిమాలో ప్రధానంగా సాగే ట్రైన్ ఎపిసోడ్‌లో ఇది యాడ్ చేస్తారని అంటున్నారు. ఇది శుక్ర, శనివారాల్లో కలిసే అవకాశం ఉంది.

ఆ సీన్లు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు
ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంతో బాగుంటుందని చిత్ర యూనిట్ చెప్పినప్పటికీ అనుకున్నంతగా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో బండ్ల గణేష్ నటించిన సీన్లను కత్తిరించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపైనా అనిల్ స్పందించాడు. తమ సినిమాలో ఏ సీన్ కత్తిరించడంలేదని ఆయన వెల్లడించాడు. కలిపే సీన్ గురించి ప్రకటన చేస్తామని చెప్పాడు.


Click it and Unblock the Notifications











