టైటిల్ కి తగ్గట్లే : 'కీచక' ఫస్ట్ లుక్(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : రీసెంట్ గా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చేతిల మీదుగా ప్రారంభమైన చిత్రం కీచక. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల్ లలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. కథ, కాన్సెప్టు ని అనుసరించే ఈ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసామని దర్శకుడు ఎన్.వి.బి చౌదరి చెప్తున్నారు. ఆసక్తికరంగా ఉన్న టైటిల్, ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం చిన్న చిత్రాలలో పెద్ద చిత్రంగా నిలుస్తుందని నిర్మాత చెప్తున్నారు. టైటిల్ రోల్ ...కీచక పాత్రలో నటుడు జ్వాలా కోటి కనిపించనున్నారు.

కథనే నమ్ముకుని చేసే సినిమాలు తెలుగులో బాగా అరుదైపోయాయి. రచయితనుంచి దర్శకులుగా మారిన వారు సైతం కథా విభాగంపై దృష్టి పెట్టడం లేదు. అయితే రీసెంట్ గా మిణుగురులు వంటి కథా బలం ఉన్న చిత్రానికి కథ అందించిన ఎస్‌.వి.బి.చౌదరి దర్శకుడు గా మారుతూ కథా బలం ఉన్న సినిమాతో ముందుకు వస్తున్నామని చెప్తున్నారు. ఆయన కొత్త చిత్రం 'కీచక'. టైటిల్ లోనే వైవిధ్యమున్న ఈ చిత్రం కథ,కథనంలోనూ అలాగే ఉండబోతోందని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే...

New Telugu Movie Keechaka First Look

యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కీచక'. ఎస్‌.వి.బి.చౌదరి దర్శకుడు. కిషోర్‌ పర్వతరెడ్డి నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్ లో మొన్న ఆదివారం ప్రారంభమైంది.

దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. ఈనెల 24 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం'' అని తెలిపారు.

శ్రీ గౌతమి టాకీస్‌ పతాకంపై కిశోర్‌ పర్వతరెడ్డి నిర్మిస్తోన్న ఈ ‘కీచక' చిత్రంలో...బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X