twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కీచక' పర్వం మొదలైంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : కథనే నమ్ముకుని చేసే సినిమాలు తెలుగులో బాగా అరుదైపోయాయి. రచయితనుంచి దర్శకులుగా మారిన వారు సైతం కథా విభాగంపై దృష్టి పెట్టడం లేదు. అయితే రీసెంట్ గా మిణుగురులు వంటి కథా బలం ఉన్న చిత్రానికి కథ అందించిన ఎస్‌.వి.బి.చౌదరి దర్శకుడు గా మారుతూ కథా బలం ఉన్న సినిమాతో ముందుకు వస్తున్నామని చెప్తున్నారు. ఆయన కొత్త చిత్రం 'కీచక'. టైటిల్ లోనే వైవిధ్యమున్న ఈ చిత్రం కథ,కథనంలోనూ అలాగే ఉండబోతోందని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే...

    యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'కీచక'. ఎస్‌.వి.బి.చౌదరి దర్శకుడు. కిషోర్‌ పర్వతరెడ్డి నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్‌బాబు క్లాప్‌నిచ్చారు. గిరిబాబు స్విచ్చాన్‌ చేశారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో స్త్రీలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిపై ఓ అమ్మాయి ఎలా స్పందించింది? ఎలాంటి పోరాటం చేసింది? అనే విషయాల్ని తెరపై చూపిస్తున్నాము ''అన్నారు.

    New Telugu Movie Keechaka Started

    నిర్మాత మాట్లాడుతూ ‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. ఈనెల 17 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం'' అని తెలిపారు.

    శ్రీ గౌతమి టాకీస్‌ పతాకంపై కిశోర్‌ పర్వతరెడ్డి నిర్మిస్తోన్న ఈ ‘కీచక' చిత్రంలో...బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

    English summary
    Keechaka telugu new film started at Rama Naidu Studies yesterday Clap by Producer Suresh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X