కారు ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్.. అందులో ఉన్నది రాజ్ తరుణ్ కదా.. తెరపైకి వచ్చిన కొత్త పేరు.!

Recommended Video

Raj Tarun Road Mishap Is Having A Lot Of Twists!! || Filmibeat Telugu

మంగళవారం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. తాజాగా ఈ కేసు విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

స్థానికులు అతడి పేరే చెబుతున్నారు

స్థానికులు అతడి పేరే చెబుతున్నారు

ఈ ప్రమాదం జరిగిన తర్వాత పారిపోయిన వ్యక్తి హీరో రాజ్ తరుణ్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాటికి తోడు సీసీ కెమెరాల్లో కూడా అతడి పోలికలే కనిపించడంతో రాజ్ తరుణ్ కారుకు ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి గాయపడ్డాడా..? లేదా..? అన్న విషయం కూడా తెలియడం లేదు. కానీ, విజువల్స్‌లో మాత్రం అతడు పరిగెత్తడం చూస్తే గాయాలు కానట్లే కనిపిస్తోంది.

హీరో తీరుతో మరిన్ని అనుమానాలు

మొదట హీరో తరుణ్‌కు ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చిన వెంటనే అతడు స్పందించాడు. తనకెలాంటి ప్రమాదం జరగలేదని, రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. అయితే, రాజ్ తరుణ్ మాత్రం అసలు స్పందించనే లేదు. ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్‌ స్వయంగా బయటకు వచ్చాడని స్థానికులు చెప్పారు. దీంతో అన్ని ఛానెళ్లలో అతడి పేరే వినిపిస్తోంది. అయినా ఈ ఘటనపై రాజ్ తరుణ్ స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసులో కొత్త ట్విస్ట్

కేసులో కొత్త ట్విస్ట్

నార్సింగ్ ప్రాంతంలో ప్రమాదానికి కారణమైన TS09 Ex 1100 నంబర్ గల కారు రాజ్ తరుణ్‌ది కాదని పోలీసులు వెల్లడించారు. ఆర్టీఏ రికార్డుల ప్రకారం ప్రదీప్ అనే బిజినెస్ మ్యాన్ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నదని చెబుతున్నారు. ఈ విషయమై సదరు వ్యక్తికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రదీప్ ఎవరన్న దానిపై అందరిలో ఆసక్తి కనిపిస్తోంది.

 పోలీసులు ఏం చెబుతున్నారంటే...

పోలీసులు ఏం చెబుతున్నారంటే...

ఈ కేసు విషయమై పోలీసులు తాజాగా స్పందించారు. ‘కారులో రాజ్ తరుణ్ ఉన్నాడా లేడా అనే విషయాన్ని సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా చెక్ చేస్తాం. కారు యజమాని ప్రదీప్‌కు నోటీసులు ఇచ్చాం. అతడు ఇచ్చే వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుంది' అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తమ కారు ప్రమాదానికి గురైందని సదరు యజమాని ఫిర్యాదు చేయలేదని కూడా వెల్లడించారు.

మిస్టరీగా మారిన కేసు

మిస్టరీగా మారిన కేసు

కారు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.. మరెవరికీ గాయాలు కాలేదు. అయినా ఈ కేసు ఎంతో హైలైట్ అయింది. దీనికి కారణం ఇందులో ఉన్నది సినీ హీరో అని వార్తలు రావడం మాత్రమే కాదు. ఈ కేసు చుట్టూ అల్లుకుని ఉన్న అనుమానాలు. అసలు కారు ఎవరిది..? ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు పారిపోయారు..? కారు ప్రమాదంపై ఫిర్యాదు ఎందుకు చేయలేదు..? వంటి చిక్క వీడని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X