రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్.. మహిళ చేత బెదిరింపులు.. సంచలనం

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్‌ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది.

Recommended Video

Actor Raj Tarun Releases A Letter Of Explanation About Road Mishap Incident || Filmibeat Telugu
సెల్ ఫోన్‌లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు

సెల్ ఫోన్‌లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు

రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి.

కారు తనది కాదంటూ బుకాయించి చివరకు

కారు తనది కాదంటూ బుకాయించి చివరకు

మొదట కార్తీక్ తో వాదనకు దిగిన రాజ్ తరుణ్.. ఆ కారు తనది కాదని, తాను దమ్ము కొట్టడానికి ఇలా బయటకు వస్తే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారని అడిగాడు. కానీ కార్తీక్ తన దగ్గర స్పష్టమైన విజువల్స్ ఉన్నాయని గట్టిగా చెప్పడంతో చివరకు కార్తీక్, రాజ్ తరుణ్ ఇద్దరూ తమ తమ సెల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో కార్తీక్‌ని రాజ్ తరుణ్ తాను మద్యం సేవించానని, తనను వదిలేయమని బ్రతిమిలాడినట్లుగా తెలుస్తోంది.

వీడియోలు ఇవ్వమంటూ మహిళ చేత బెదిరింపులు

వీడియోలు ఇవ్వమంటూ మహిళ చేత బెదిరింపులు

తన సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్న రాజ్ తరుణ్.. తన యాక్సిడెంట్ తాలూకు వీడియోలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని అంటున్నాడు కార్తీక్. రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ నటుడు రాజా రవీంద్రతో పాటు మరో మహిళ అతనికి ఫోన్ చేసి బెదిరిస్తునట్లుగా మీడియా పేర్కొంటోంది. ఈ కోణంలో అతనికి డబ్బు ఆశ కూడా చూపారని వార్తలు వస్తున్నాయి.

 పోలీసులు విచారించక పోవడంతో

పోలీసులు విచారించక పోవడంతో

ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారించక పోవడంతో ఈ యాక్సిడెంట్ ఇష్యు చర్చనీయాంశంగా మారింది. ఈ లోగా కార్తీక్ అనే వ్యక్తి ఆడియో రికార్డ్స్ బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే ప్రాణాఅదానికి గల కారణాలపై ఇప్పటికైతే సరైన స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన రెండు రోజులు తరువాత ఓ వీడియో ద్వారా.. తాను క్షేమంగానే ఉన్నట్లు, సీటు బెల్టు పెట్టుకోవడంతో బయటపడినట్లు రాజ్‌తరుణ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 రాజ్ తరుణ్ చిట్ చాట్

రాజ్ తరుణ్ చిట్ చాట్

ఇక రాజ్ తరుణ్ ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన రాజ్ తరుణ్.. ‘ప్రమాదం జరిగినప్పుడు మద్యం సేవించి ఉన్నారా' అని చాలా మంది అడిగిన ప్రశ్నలకు 'నో' అని సమాధానం ఇచ్చాడు. మధ్యలో ఓ నెటిజన్ ‘డ్రింక్ చేస్తే మాత్రం చేసాం అని చెప్తారా ఏంటి' అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి ‘యాక్సిడెంట్ అయ్యి బాధ పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా' అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X